డార్లింగ్ బరువంతా రాధాకృష్ణ మీదే

0

సాహో కౌంట్ డౌన్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం మొదలైపోయింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కొన్ని థియేటర్లు మొదలుపెట్టగా టికెట్ ధరల పెంపు జీవో కోసం ఎదురు చూస్తున్న యాజమాన్యాలు మాత్రం రేపో ఎల్లుండో స్టార్ట్ చేయబోతున్నారు. రికార్డుల గురించి ఊహకందని స్థాయిలో అంచనాలు సాగుతున్నాయి. బాహుబలి 2ని ఎంత మార్జిన్ తో బీట్ చేస్తుందనే లెక్కల్లో ఫ్యాన్స్ ఉండగా ఫస్ట్ డే ఎంత గ్రాస్ ఎంత షేర్ వస్తుందనే జోస్యంలో ట్రేడ్ మునిగి తేలుతుంది.

అన్ని వర్గాలను మెప్పించే స్థాయిలో సాహో ఉందా లేదా అనేదాని మీదే ఫలితం ఆధారపడి ఉంటుంది. అయితే రిజల్ట్ ఎలా ఉన్నా దర్శకుడు రాధాకృష్ణ మీద మాత్రం చెప్పలేనంత బరువు పడబోతున్నది మాత్రం వాస్తవం. ఎలా అంటారా. ఇక్కడ పాయింట్ వేరే ఉంది. సాహో తర్వాత యువి సంస్థలోనే ప్రభాస్ మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ పాతిక శాతం పూర్తి చేశారు. సాహో కనక ఇండస్ట్రీ హిట్ అయితే దానికి రెట్టింపు అంచనాలు రాధాకృష్ణ మూవీ మీద మొదలవుతాయి.

ఒకవేళ సాహో ఏ మాత్రం అటు ఇటు అయినా ఆ బరువు కూడా తన మీదే పడుతుంది. ప్రభాస్ రేంజ్ ని మరోసారి ప్రూవ్ చేయాల్సిన ప్రెజర్ పడుతుంది. బాహుబలి సాహో లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల తర్వాత వస్తున్న మూవీ కాబట్టి అన్ని రకాలుగా పోలికలు ఒత్తిళ్లు తెస్తారు. వాటిని తట్టుకుని ధీటుగా కంటెంట్ తో కొట్టాల్సిన బాధ్యత రాధాకృష్ణ మీద చాలా ఉంది. టైం పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో యూరోప్ లో సాగే డిఫరెంట్ లవ్ స్టోరీగా ఇప్పటికే కొన్ని లీక్స్ ఉన్నాయి. సో డార్లింగ్ ప్రభాస్ సాహోతో హిట్టు కొట్టినా కొట్టకపోయినా ఆ తర్వాత వచ్చే సినిమా దర్శకుడిగా మొత్తం బరువు రాధాకృష్ణ మీదే ఉంటుంది
Please Read Disclaimer