మూడు వారాలు ప్రభాస్ పిచ్చెక్కిస్తాడట!

0

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా ‘సాహో’ ఆగష్టు 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఇప్పటికే టీజర్.. ట్రైలర్లు.. పోస్టర్స్.. లిరికల్ సింగిల్స్ అంటూ పబ్లిసిటీ హంగామా కొనసాగుతోంది. ఈ ప్రమోషన్స్ ను పీక్స్ కు తీసుకెళ్లేందుకు స్వయంగా రంగంలోకి దిగుతున్నడట. ‘సాహో’ భారీ స్థాయిలో బహుభాషా చిత్రంగా విడుదల అవుతోంది కాబట్టి దేశవ్యాప్తంగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్లాన్ చేశారట.

ఏపీ.. తెలంగాణా రాష్ట్రాల రెండు భారీ ఈవెంట్స్ జరపడంతో పాటుగా దేశంలోని పలు ప్రధాన నగరాలను ప్రభాస్ సందర్శించి అక్కడ ప్రమోషన్స్ ఈవెంట్స్ లో పాల్గొంటాడట. ఢిల్లీ.. ముంబై.. కోల్ కతా.. పూణే.. చెన్నై.. బెంగళూరు.. కొచ్చి నగరాలలో ‘సాహో ప్రమోషనల్ కార్యక్రమాలను ప్లాన్ చేశారట. కొన్ని నగరాల్లో ప్రభాస్ మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేలా యూవీ క్రియేషన్స్ వారు షెడ్యూల్ తయారుచేయడం జరిగిందట. ఒకసారి ఈ కార్యక్రమాలు స్టార్ట్ అయితే ‘సాహో’ హంగామా పీక్స్ కు చేరుతుంది. ప్రభాస్ ఈ ప్రమోషన్స్ కోసం దాదాపు మూడు వారాల సమయం కేటాయించాడట. ప్రభాస్ ఇలా స్వయంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆయా నగరాలలోని డార్లింగ్ అభిమానులకు ఫుల్ జోష్ ఇస్తుందనడంలో సందేహం లేదు.

‘సాహో’ లో ప్రభాస్ కు జోడీగా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. జాకీ ష్రాఫ్.. నీల్ నితిన్ ముకేష్.. వెన్నెల కిషోర్.. మందిరా బేడి.. చుంకీ పాండే.. మహేష్ మంజ్రేకర్..ఎవెలిన్ శర్మ.. టిను ఆనంద్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషించారు. జిబ్రాన్ ఈ సినిమాకు నేపథ్య సంగీతం అందిస్తున్నాడు.
Please Read Disclaimer