బర్త్ డే బోయ్ ప్రభాస్ మీడియా మీట్

0

సాహో రిజల్ట్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న `జాన్` కాన్వాస్ మారిందన్న ప్రచారం సాగుతోంది. దాంతో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాపై సీరియస్ గానే వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో భారీ సెట్ నిర్మిస్తున్నారు. ఇందులో నవంబర్ 20 నుంచి జాన్ షెడ్యూల్ కి హాజరు కావాల్సి ఉంది. అంతకుముందే డార్లింగ్ పూర్తిగా రిలాక్స్ అయ్యేందుకు విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవలే లండన్ రాయల్ ఆల్బర్ట్ థియేటర్ లో బాహుబలి ప్రివ్యూకి ఎటెండయిన ప్రభాస్ నేడు బర్త్ డే శుభాకాంక్షల్ని అందుకున్నాడు. సెలబ్రిటీలు సహా అభిమానులు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలతో ముంచెత్తారు.

తదుపరి జాన్ షూటింగుకి వెళ్లే ముందే ప్రభాస్ నేటి సాయంత్రం హైదరాబాద్ ఎఫ్.ఎన్.సి.సిలో మీడియా జనాల్ని కలవనున్నారని తెలుస్తోంది. ప్రభాస్ ఇప్పటికే లండన్ నుంచి ప్యారిస్ వెళ్లి విరామ సమయాన్ని గడిపారు. నేడు 40వ బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ లోనే అందుబాటులో ఉన్నారని తెలుస్తోంది. ప్యారిస్ నుంచి నిన్న (సోమవారం) సాయంత్రం హైదరాబాద్ లో అడుగు పెట్టారని సన్నిహిత వర్గాల ద్వారా వెల్లడైంది.

మరి కాసేపట్లో మీడియా కరచాలనానికి డార్లింగ్ విచ్చేస్తారని సమాచారం. ప్రతిసారీ తన పుట్టినరోజు వేళ మీడియా మిత్రులతో కాసేపు సరదాగా కాలక్షేపం చేయడం డార్లింగుకి అలవాటు. అందుకే అతడు మీడియాకి కూడా ఫ్రెండ్లీ డార్లింగ్. కేవలం సినిమా ప్రచారం వరకే మీడియాని పరిమితం చేయడమే గాకుండా స్నేహస్వభావం కలిగి ఉండే హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను ఆపాదించుకున్నారు ప్రభాస్. తదుపరి బిజీ షెడ్యూల్స్ లోకి వెళ్లే ముందే ఇదో ఫ్రెండ్లీ మీట్.
Please Read Disclaimer