ఎట్టకేలకు ప్రభాస్ 20 కొత్త అప్డేట్ వచ్చింది

0

సాహో విడుదలకు ముందు రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ 20వ చిత్రం ప్రారంభం అయ్యింది. కాని ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ఎలాంటి వివరాలు కాని సినిమాకు సంబంధించిన పోస్టర్స్ వీడియోను కాని విడుదల చేయలేదు. షూటింగ్ మెల్లగా చేస్తూ వచ్చారు. ఎక్కువ శాతం విదేశాల్లో చిత్రీకరణ జరపాల్సి ఉన్న కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు మహమ్మారి వైరస్ కారణంగా సినిమా గత మూడు నెలలుగా అటకెక్కింది.

ఇదే సమయంలో యూవీ క్రియేషన్స్ నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాని ఎప్పటికప్పుడు యూవీ క్రియేషన్స్ వారు దాన్ని వాయిదా వేస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహంకు గురవుతున్నారు. తాజాగా ప్రభాస్ 20 మూవీ అప్ డేట్ ఒకటి అనధికారికంగా వచ్చింది. ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు అనే విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చారు.

ప్రముఖ తమిళ యంగ్ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ 20 మూవీ కోసం కొన్ని ట్యూన్స్ కూడా చేశాడనే టాక్ వినిపిస్తుంది. విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ చిత్రంతో తెలుగు వారికి పరిచయం అయిన జస్టిన్ ఖచ్చితంగా ప్రభాస్ మూవీకి మంచి సంగీతాన్ని అందిస్తాడనే నమ్మకంను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. రాధే శ్యామ్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే.
Please Read Disclaimer