డార్లింగ్ వెయిట్ పెరిగింది జాన్ కోసమా?

0

డార్లింగ్ ప్రభాస్ ‘సాహో’ తర్వాత రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘జాన్’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదో పీరియాడిక్ లవ్ స్టొరీ.. ఐరోపా నేపథ్యంలో జరిగే కథ కావడంతో ఈ సినిమా విభిన్నంగా ఉండబోతోందని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎప్పుడూ ఫిట్ గా సిక్స్ ప్యాక్ యాబ్స్ తో ఉండే ప్రభాస్ ఈమధ్య కాస్త చబ్బీగా కనిపిస్తున్నారు. కొత్త సినిమా షూటింగ్ దగ్గరపడుతుంటే ఇంకా ప్రభాస్ బొద్దుగా ఉండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ సినిమా 70 ల నాటి కథ కావడంతో అప్పటి ట్రెండ్ కు తగ్గట్టు ప్రభాస్ మరీ స్లిమ్ లుక్ లో కాకుండా కాస్త బొద్దుగానే కనిపించాల్సి ఉందట. అందుకే ఎప్పుడూ పర్ఫెక్ట్ వెయిట్ తో ఉండే ప్రభాస్ ఈమధ్య కాస్త బొద్దుగా కనిపిస్తున్నారని సమాచారం. మరి ఈ వెర్షన్ నిజమా కాదా తెలియాలంటే మాత్రం ‘జాన్’ షూటింగ్ ఆన్ లొకేషన్ స్టిల్స్ బయటకు రావాలి. ఇదిలా ఉంటే ‘సాహో’ ఫలితం తర్వాత ఈ సినిమా కథ విషయంలో కొన్ని మార్పు చేర్పులు జరిగాయట. బడ్జెట్ అదుపు తప్పకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారట.

ఈ సినిమాలో ప్రభాస్ సరనస పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది దసరా సీజన్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ‘సాహో’ జయాపజయాల సంగతి ఎలా ఉన్నా ప్రేక్షకుల అంచనాలు అందుకోలేదన్నది మాత్రం వాస్తవం. మరి ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Please Read Disclaimer