అందుకే కృష్ణంరాజు లైన్లోకి వచ్చారట!!

0

బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. సుజిత్ దర్శక్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఫ్రెండ్స్ బ్యానర్ కాబట్టి అది ప్రభాస్ కు హోమ్ బ్యానర్ లాంటిదని మనం ఫిక్స్ అయిపోవచ్చు. ఈ బ్యానర్లో చేసే సినిమాలకు ప్రభాస్ రెమ్యూనరేషన్ కాకుండా లాభాల్లో వాటా తీసుకుంటాడని టాక్ ఉంది. ‘సాహో’ తర్వాత రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ చేసే సినిమాకూడా యూవీ లోనే తెరకెక్కవలసి ఉంది. కానీ లాస్ట్ మినిట్ లో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ కూడా ప్రొడక్షన్ పార్టనర్ గా తోడయ్యారు.

మరి లాస్ట్ మినిట్ లో ఎందుకు రెబెల్ స్టార్ లైన్ లోకి వచ్చారు? బాహుబలి తర్వాత కృష్ణంరాజు ప్రభాస్ తో ఒక సినిమా చేయాలని ఆ సినిమాను గోపీ కృష్ణా బ్యానర్ పై నిర్మించాలని ప్లాన్ చేశారట. కానీ ఆ సినిమా డిలే అవుతుండడంతో ప్రభాస్ ఈ సినిమాకు యువీ వారితో పాటు గా నిర్మాణ భాగస్వామిగా ఉండేలా మార్చారట. దీంతో కృష్ణంరాజు గారి కోరిక తీరినట్టు అవుతుందని అలా ప్లాన్ చేశారట. ఈ సినిమా కొద్దిరోజుల క్రితమే పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా గురించి మరొక ఇంట్రెస్టింగ్ టాక్ కూడా వినిపిస్తోంది. ఈ స్టొరీని ముందుగా యూవీ వారు రామ్ చరణ్ కోసం అనుకున్నారట. కానీ ఎందుకో కుదరలేదని దాంతో ప్రభాస్ కి తగ్గట్టు మార్చారని సమాచారం.