భళిరా ‘సైరా’ స్టార్ తో ‘సాహో’ స్టార్!

0

సౌత్ ధమాకా ఎలా ఉంటుందో బాలీవుడ్ వాళ్లకు ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. `బాహుబలి` ఫ్రాంఛైజీ ట్రీట్ ని ఇంకా మర్చిపోక ముందే ఈసారి డబుల్ ట్రీట్ రెడీ అవుతోంది. 2019లో వరుసగా రెండు మోస్ట్ అవైటెడ్ సినిమాలు రిలీజవుతున్నాయి. అవి రెండూ తెలుగు గడ్డ మీద నుంచే బాలీవుడ్ పై దండయాత్రకు వెళుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు సినిమాలపైనా ముంబై మీడియాలోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది. `సాహో` మేకింగ్- ట్రైలర్ తో మెస్మరైజ్ అయిపోయిన ముంబై మీడియా .. లేటెస్టుగా `సైరా` మేకింగ్ వీడియో- టీజర్ లను చూసి షాక్ తింది. ఇది బాలీవుడ్ కి ఎర్త్ షేకింగ్ ట్రీట్ అనే చెప్పాలి.

ఆసక్తికరంగా నేడు ముంబై ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి – నిర్మాత రామ్ చరణ్- సురేందర్ రెడ్డి- సుదీప్ తదితర బృందం టీజర్ ని లాంచ్ చేశారు. అయితే అక్కడ ఊహించని విధంగా ఓ సర్ ప్రైజ్ ఎదురైంది.
సైరా ఈవెంట్ అయిపోగానే టీమ్ ని గ్రీట్ చేసేందుకు అక్కడికి `సాహో` స్టార్ ప్రభాస్ విచ్చేశాడు. అక్కడ నిర్మాత రామ్ చరణ్ .. మెగాస్టార్ చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ఆ ముగ్గురూ కలిసి ఉన్న ఫోటో అంతర్జాలంలోకి రిలీజైంది.

ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన సినిమా సాహో ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ప్రభాస్ ఓ మాట అన్నారు. “చిరంజీవి గారు ట్రైలర్ చూసి అభినందిస్తూ మెసేజ్ చేశారు. వెంటనే కాల్ చేసి నేను మాట్లాడాను. ఆయన ప్రశంస దక్కడం గొప్ప అనుభూతినిచ్చింది. మర్చిపోలేని అనుభూతి కలిగింది“ అని ప్రభాస్ అన్నారు. ఎంతో డౌన్ టు ఎర్త్ ఉండే డార్లింగ్ ఇప్పుడు ఇలా `సైరా` ఈవెంట్ దగ్గరికే వెళ్లి ఇలా అభినందించడం అభిమానులకు సంబరం లాంటిదే. సాహో- సైరా చిత్రాల్ని గంపగుత్తగా మెగా- రెబల్ ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్లు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రెండు సినిమాలు తెలుగు సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లబోతున్నాయని సంకేతం కనిపిస్తోంది.
Please Read Disclaimer