శర్వా పెట్టేసుకున్నాడు ప్రభాస్ సంగతేంటి ?

0

‘సాహో’ తర్వాత ప్రభాస్ చేస్తున్న మరో సినిమా షూటింగ్ స్టేజిలో ఉంది. రాధా కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ కి లేటెస్ట్ గా ‘జాన్’ అనే టైటిల్ ఫైనల్ చేసుకొని పెట్టేసుకున్నారు. షూటింగ్ లో కూడా క్లాప్ బోర్డ్ మీద ఈ టైటిల్ ప్రింట్ ఇచ్చుకున్నారు. సో మేకర్స్ ఈ టైటిల్ కె ఫిక్సయి రానదానికి ఇంతకంటే నిదర్శనం లేదు. కానీ ఇదే టైటిల్ అటు ఇటుగా మార్చి ఇప్పుడు శర్వ -సమంత ’96’ రీమేక్ సినిమాకు పెట్టేసుకున్నారు.

తమిళ్ లో సూపర్ హిట్టయిన ’96’ లో హీరోయిన్ క్యారెక్టర్ కి ఆమె సన్నివేశాలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. సినిమాలో త్రిష పేరు జాను. ఆ పేరు తెలుగు ప్రేక్షకులను కూడా ఇంప్రెస్ చేసేసింది త్రిష. అందుకే తెలుగులో సమంతకి కూడా అదే పేరును పెట్టారట. ఇక ఆమె పేరునే ఇప్పుడు టైటిల్ గా పెట్టేసుకొని ఫస్ట్ లుక్ వదిలారు.

అయితే నిజానికి జాన్ కి జాను కి పెద్ద తేడా ఉండదు. టైటిల్స్ పేరైనా పలికే అప్పుడు రెండూ ఒకే విధంగా ఉంటాయి. ఇదే ఇప్పుడు ప్రభాస్ నిర్మాతలకు ఏం చేయాలో అర్థం కాకుండా చేస్తుంది. మరి వాళ్ళు ఫిక్సయిన టైటిల్ నే పెడతారా లేదా జాను ఎఫెక్ట్ తో టైటిల్ మార్చుకుంటారా చూడాలి.
Please Read Disclaimer