#కరోనా.. ప్రభాస్ సామాజిక బాధ్యత ఇదేనా?

0

కరోనా వైరస్ మహమ్మారికి ప్రపంచ దేశాలు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయో తెలిసిందే. వైరస్ వ్యాప్తి రోజురోజుకి ఉదృతం అవుతోంది. ఇండియాలో వైరస్ ఇప్పుడిప్పుడే ప్రతాపం చూపిస్తోంది. ఇప్పటికే 85 కరోనా నిర్ధారణలు కేసులున్నాయి. వైరస్ కారణంగా ఇద్దరు మరణించారు. కేసుల సంఖ్య ఇంకా పెరిగిపోతోంది. తొలుత వైరస్ ని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు లైట్ తీసుకున్నా! తర్వాత సీన్ ఎలా ఉందో? అర్ధం చేసుకున్నాయి. దీంతో హుటా హుటిన ఇరు ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. లేటెస్టుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సినిమాహాళ్లు.. పబ్లిక్ సమావేశాలు..పెళ్లిళ్లు పేరాంటాలు…ప్రయాణాలు వంటివి ఉంటే వాయిదా వేసుకోమని సూచించారు.

ఆ విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఇష్టానుసారం బయట తిరిగితే ఊరుకోం అని..ఇది విపరీత పరిస్థితి అని భయపెడుతూ.. జైల్లో వేసేస్తాం అంటూ హెచ్చరించడాన్ని బట్టి సీరియస్ నెస్ ఏమిటో అర్థమవుతోంది. ఇక ఏపీలోనూ కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది. తాజాగా స్థానిక ఎన్నికలను వాయిదా వేసింది. ఇక మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమా షూటింగ్ ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇంకా ఇతర స్టార్ హీరోలు షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చేసారు. ఇలా కరోనాని మన దేశం నుంచి..రాష్ట్రం నుంచి తరిమి కొడదమని బలంగా సంకల్పించి ముందుకెళ్తున్నారు.

అయితే రెబల్ స్టార్ ప్రభాస్ కు మాత్రం ఇవేవీ పట్టనట్లే వ్యవహరిస్తున్నాడు. ప్రాణాంతక కరోనా ప్రపంచాన్ని కబలిస్తోందని తెలిసినా ఎలాంటి భయం లేకుండా ముక్కుకు మాస్క్ పెట్టుకుని యూరప్ వెళ్లాడు. అక్కడ జార్జియాలో షూటింగ్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం అక్కడా వైరస్ నెమ్మదిగా పాకుతోంది. పైగా అక్కడ వాతావరణం చాలా శీతలంగా ఉంది. షూటింగ్ ను 10 డిగ్రీల సెంటిగ్రేట్ వద్ద చేస్తుండడం ప్రమాద సంకేతాల్ని అందిస్తోంది. వైరస్ కు అనుకూలమైన ప్రదేశం జార్జియా అని అర్థమవుతోంది. కూల్ ఏరియాల్లో వైరస్ వ్యాప్తి ఇంకా వేగంగా ఉంటుంది. కానీ ప్రభాస్ ఇవన్ని తెలిసి కూడా ఏమాత్రం సామాజిక బాధ్యత లేకుండా షూటింగ్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభాస్ అభిమానులు సహా ఈ విషయంలో చాలా సీరియస్ అవుతున్నారు. పొరపాటున టీమ్ లో ఎవరికైనా వైరస్ సోకితే పరిస్థితి ఏంటి? అక్కడ నుంచి ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత ఇక్కడ వాళ్లకు అంటుకుంటే దానికి బాధ్యులు ఎవరు అవుతారు? అంటూ సోషల్ మీడియాల్లో మండిపడుతున్నారు. తక్షణం షూటింగ్ నిలిపివేసి వైరస్ తగ్గే వరకూ ఇంటికే పరిమితమవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి జాన్ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-