చిరంజీవి గారు ఫోన్…గూస్ బంప్స్

0

ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 30న గ్రాండ్ గా రిలీజ్ కానుంది ప్రభాస్ ‘సాహో’. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు టీమ్. నిన్న ముంబైలో ట్రైలర్ లాంచ్ చేసి అక్కడ మీడియాతో ముచ్చటించారు. బాలీవుడ్ మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు ఎప్పటికెలాగే కూల్ గానే ఆన్సర్స్ ఇచ్చాడు డార్లింగ్.

అయితే ఈరోజు హైదరాబాద్ లో తెలుగు మీడియాతో ఇంటరాక్షన్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో సాహో గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు ప్రభాస్. సినిమాలో తన క్యారెక్టర్ గురించి అడిగిన ప్రశ్నకు మాత్రం సరైన జవాబివ్వలేదు డార్లింగ్. తన రోల్ గురించి ఏం చెప్పకుండా సాహో స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా అని కథ నడిచే విధానం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని బాహుబలి తర్వాత చేస్తున్న సినిమా కావడంతో కథ – స్క్రీన్ ప్లే పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపాడు.

సుజిత్ సినిమాను చాలా బాగా హ్యాండిల్ చేశాడని ఇంత పెద్ద సినిమా సినిమా చేస్తూ కూడా ఎప్పుడూ కోపమనేది చూపించకుండా చాలా కూల్ గా డైరెక్ట్ చేశాడని చెప్పాడు. ట్రైలర్ కట్ చేయడం కోసం చాలా కష్టపడ్డామని ట్రైలర్ చూసాక చిరంజీవి గారు కాల్ చేసారని – ఆ క్షణంలో గూస్ బంప్స్ వచ్చాయని రాజమౌళి గారూ కూడా మాట్లాడారని అన్నాడు.
Please Read Disclaimer