ఆ మాటతో ‘జాన్’ను ఎక్కడికో తీసుకెళ్లిన ప్రభాస్

0

ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రం కోసం దాదాపు అయిదు సంవత్సరాలు.. ‘సాహో’ చిత్రం కోసం రెండేళ్లు సమయం కేటాయించిన విషయం తెల్సిందే. సాహో విడుదలైన వెంటనే ‘జాన్’ చిత్రం షూటింగ్ తో ప్రభాస్ బిజీ అవ్వబోతున్నాడు. బాహుబలి.. సాహో చిత్రాల మాదిరిగా మరీ ఎక్కువ సమయం తీసుకోకుండా వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్రభాస్ కోరుకుంటున్నాడు.

ఇప్పటి వరకు ఈ చిత్రం గురించి ఎలాంటి విషయాలు రివీల్ చేయలేదు. జాన్ అనేది కూడా ఆడియన్స్ అంటూ ఉంటే వర్కింగ్ టైటిల్ గా అనుకున్నారు. దాన్నే ప్రభాస్ కూడా అంటున్నాడు. అలాంటి సినిమా గురించి ప్రభాస్ తాజాగా ‘సాహో’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సాహో స్థాయిలో కాకున్నా జాన్ కు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. 1960-70 కాలంలో సాగే పీరియాడిక్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్నట్లుగా కూడా ప్రభాస్ పేర్కొన్నాడు.

ఇక మరో ముఖ్యమైన విషయమేంటంటే ఈ చిత్రంలోని ఒక విషయం ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై ప్రేక్షకులు చూడలేదు. జాన్ చిత్రంలో ఆ విషయాన్ని చూపించి ప్రేక్షకులను ఆశ్చర్యపర్చబోతున్నట్లుగా ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ఆ మాటతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు చూడని ఆ విషయం ఏమై ఉంటుందా అంటూ ఇప్పటి నుండే చర్చ మొదలైంది.

‘జిల్’ వంటి స్టైలిష్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాధాకృష్ణ ఈ చిత్రాన్ని కూడా చాలా స్టైలిష్ మ్యానర్ లో రూపొందిస్తున్నాడు. ఇప్పటికే జాన్ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ లీక్ అయ్యాయి. అందులో ప్రభాస్ గెటప్ చాలా విభిన్నంగా ఉండటంతో పాటు స్టైలిష్ గా అనిపిస్తుంది. యూరప్ లో ఇప్పటికే కొంత చిత్రీకరణ జరిపారు. ఇక హైదరాబాద్ లో ఈ చిత్రం కోసం యూరప్ కు సంబంధించిన వాతావరణంతో సెట్టింగ్స్ నిర్మిస్తున్నారు. యూరప్ లో 1960లో ఎలా ఉందనే విషయాన్ని కళ్లకు కట్టేలా ఇక్కడ సెట్స్ నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. జాన్ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

సాహో విడుదలైన తర్వాత కాస్త రెస్ట్ తీసుకుని ఆ వెంటనే జాన్ చిత్రం షూటింగ్ లో ప్రభాస్ పాల్గొనే అవకాశం ఉంది. సాహో చిత్రంతో ఇండియా వ్యాప్తంగా మరోసారి సందడి చేసేందుకు సిద్దమయిన ప్రభాస్ ‘జాన్’ తో కూడా ఇండియా వ్యాప్తంగా సందడి చేసేలా ఇప్పటి నుండే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాన్ చిత్రంలోని కొన్ని సీన్స్ ను బాలీవుడ్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా తీస్తున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. సీన్స్ ప్రత్యేకంగా తీసినా తీయకున్నా కూడా జాన్ కు బాలీవుడ్ ప్రేక్షకులు తప్పకుండా బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంది.
Please Read Disclaimer