ఆర్జీవీ పేరునే ప్రభాస్ ఎందుకు తలిచాడు?

0

తెలుగు సినిమా దశ దిశ తిప్పేసిన సినిమా ఏది? 100ఏళ్ల భారతీయ సినిమా హిస్టరీలో 88ఏళ్ల టాలీవుడ్ ప్రస్థానంలో మన సినిమా గమనాన్ని మార్చిన గ్రేట్ మూవీ ఏది? అంటే .. చాలామంది బాహుబలి అనే ముక్త కంఠంతో చెబుతున్నారు. అయితే ఇందులో ఓ చిన్న కరెక్షన్ చెబుతున్నాడు డార్లింగ్ ప్రభాస్.

అసలు మన దశ దిశ తిప్పిన సినిమా బాహుబలి కాదు. దాదాపు 30 ఏళ్ల క్రితం రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ మూవీ `శివ` ఈ మార్పునకు కారణం అని చెప్పాడు ప్రభాస్. అది కూడా లండన్ రాయల్ ఆల్బర్ట్స్ థియేటర్ లో బాహుబలి ప్రివ్యూ అనంతరం మీడియా ప్రశ్నలకు సమాధానంగా ఇలా స్పందించాడు. అసలు తెలుగు సినిమా దశ దిశ మార్చిన సినిమా ఏది? అన్న ప్రశ్నకు ప్రభాస్ పైవిధంగా స్పందించాడు.

మొత్తానికి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కంటే ముందే గురువు ఆర్జీవీ ఉన్నాడని ప్రభాస్ ఎంతో వినమ్రంగా అంగీకరించడం బాగానే ఉంది. శివ రిలీజైన మూడు దశాబ్ధాలకు అంతే గొప్ప మేలి మలుపును ఇచ్చిన సినిమా బాహుబలి. ఇక్కడి నుంచే తెలుగు సినిమా మార్కెట్ అనూహ్యంగా పెరిగింది. ఇరుగు పొరుగు పరిశ్రమలు గుర్తించాయి. ప్రపంచవ్యాప్తంగా జనాల కళ్లు మనవైపు ఉన్నాయి. అప్పటివరకూ ఉన్న ఫార్ములా సినిమాల బాణీని పంథాని మార్చి దశ దిశ తిప్పేసిన గ్రేట్ మూవీ శివ అనడంలో సందేహం లేదు. అలాగే సినిమా అంటే ఒక్క ప్రాంతానికేనని బిగదీసుకుని కూచున్న మన ఫిలింమేకర్స్ కి కళ్లు తెరిపించిన పాన్ ఇండియా సినిమాగా బాహుబలి రికార్డులకెక్కింది. హ్యాట్సాఫ్ టు ఆర్జీవీ అండ్ రాజమౌళి.
Please Read Disclaimer