ఆల్ ఇండియా సూపర్ స్టార్ పారితోషికం ఇంతేనా?

0

బాహుబలి చిత్రంతో ప్రభాస్ ఆల్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాహో చిత్రంతో ఆ విషయం నిరూపితం అయ్యింది. సౌత్ లో సాహో ఒక మోస్తరుగా ఆడినా ఉత్తరాదిన మాత్రం భారీ వసూళ్లను రాబట్టింది. గత ఏడాది బాలీవుడ్ టాప్ చిత్రాల జాబితాలో చేరింది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాను కూడా బాలీవుడ్ బయ్యర్లు భారీ మొత్తానికి కొనుగోలు చేసేందుకు క్యూలో ఉన్నారు.

తమిళ స్టార్ హీరోలు రజినీకాంత్ ఇంకా విజయ్ లు 75 నుండి 100 కోట్ల వరకు తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మాస్టర్ చిత్రంకు గాను విజయ్ తీసుకుంటున్న పారితోషికం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయ్యింది. విజయ్ కి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా పెద్దగా మార్కెట్ లేదు. అయినా కూడా అంతటి పారితోషికం తీసుకుంటున్నాడు. అలాంటిది ప్రభాస్ ఎంత పారితోషికం తీసుకోవాలి. పింక్ రీమేక్ కు పవన్ అంతా ఇంతా అంటూ ప్రచారం జరుగుతుంది. మరి ప్రభాస్ ఏ స్థాయిలో పారితోషికం తీసుకోవాలి చెప్పండి.

సాహో మరియు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు హోం బ్యానర్ లోనే కనుక పారితోషికం విషయం చర్చకు రాలేదు. కాని తాజాగా అశ్వినీదత్ బ్యానర్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమాకు ప్రభాస్ తీసుకుంటున్న పారితోషికం విషయమై చర్చ జరుగుతోంది. ఈ చిత్రంకు గాను 75 కోట్ల పారితోషికంను తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను కొందరు కొట్టి పారేస్తున్నారు. ప్రభాస్ బ్రాండ్ వ్యాల్యూకు 75 కోట్ల పారితోషికం ఏంటీ అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

ప్రభాస్ పేరు చెప్పి ఎంత తక్కువ బడ్జెట్ సినిమాను అయినా ఈజీగా రెండు వందల కోట్ల బిజినెస్ చేయవచ్చు. అలాంటిది ఆయనకు కనీసం వంద కోట్లకు పైగా ఇవ్వాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి నాగ్ అశ్విన్ సినిమాకు అశ్వినీదత్ యంగ్ రెబల్ స్టార్ కు ఎంత ఇస్తున్నాడో ఆయనకే తెలియాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-