సాహోలో మంచి దొంగ ఫార్ములా?

0

ఇంకో 60 గంటలు గడిస్తే చాలు సాహో ఫస్ట్ షో స్క్రీన్ మీద పడిపోతుంది. ఎక్కడ ఏ టైంలో అనే పూర్తి వివరాలు బయటికి రాలేదు కానీ గురువారం అర్ధరాత్రి నుంచే అన్నది మాత్రం దాదాపు ఖరారు అయినట్టే. ఇప్పటికే దుబాయ్ నుంచి వచ్చిన ప్రీ పాజిటివ్ రిపోర్ట్స్ డార్లింగ్ ఫ్యాన్స్ ని నిద్రపోనివ్వడం లేదు. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన సాహో బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుందని నమ్మకంతో ఉన్నారు మూవీ లవర్స్.

ఇదిలా ఉండగా రిలీజ్ దగ్గర పడే కొద్దీ సాహోకు సంబందించిన చిన్న చిన్న లీక్స్ బయటికి వస్తున్నాయి. ఇవి నిజమో కాదో తెలిసేది సినిమా వచ్చాకే కానీ అప్పటిదాకా సస్పెన్స్ భరించలేని ఫ్యాన్స్ మధ్య ఇవి ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తున్నాయి. వాటిలో ప్రధానమైనది ప్రభాస్ పాత్ర గురించి. ట్రైలర్ లో అశోక చక్రవర్తి అనే అండర్ కాప్ గా ప్రభాస్ ని చూపించారు కదా. కానీ వాస్తవానికి ఇందులో డార్లింగ్ రోల్ దొంగతనాలు చేస్తుందట.

ఎందుకు అనే కారణాలు తెలియదు కానీ అర్జున్ జెంటిల్ మెన్ – కిక్ తరహాలో ఒక మంచి ఉద్దేశం తో చోరీలు చేస్తూ ఓ ప్రమాదకరమైన వలయంలో హీరోయిన్ తో పాటు చిక్కుకుపోతాడట. అదేంటనేదే సాహోలోని అసలు పాయింట్ గా చెబుతున్నారు. హీరో దొంగగా చేయడం కొత్తేమి కాదు. ఉన్నతమైన లక్ష్యంతో చేసే దోపిడీలకు ప్రేక్షకులు గతంలో సూపర్ హిట్స్ రూపంలో ఫలితాలను ఇచ్చారు. అలాంటిది ఇంత పెద్ద స్కేల్ మీద తీస్తే వద్దంటారా. కాకపోతే ఇది నిజమా కాదా అనేది తెలియాలంటే మాత్రం శుక్రవారం దాకా వెయిట్ చేయాల్సిందేPlease Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home