‘సాహో’ కౌంట్ డౌన్ మొదలైంది

0

‘సాహో’ కోసం ఇప్పుడు ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ‘బాహుబలి’ సిరీస్ ల తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో చేస్తున్నారు మేకర్స్. ఎక్కడ చూసినా ఇప్పుడు ‘సాహో’ మేనియానే కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పటికే ‘సాహో’ ఎమోజీలతో సందడి మొదలైంది. మరో వైపు టివీల్లో కూడా రిలీజ్ యాడ్స్ స్టార్ట్ అయ్యాయి.

ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్ లో కూడా టెన్షన్ కనిపిస్తుంది. ప్రభాస్ కి ఇప్పుడు ‘సాహో’ బ్లాక్ బస్టర్ కి మించి టాక్ రావడం చాలా ముఖ్యం. అప్పుడే దాదాపు ‘బాహుబలి 2’ని అందుకోగలడు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు రెబల్ స్టార్. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ట్విస్టులు క్లిక్ అయి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తే ఇండస్ట్రీ హిట్ రేంజ్ కి వెళ్ళడం ‘సాహో’కి సులువే.ఇప్పుడు సాహో టీం టార్గెట్ కూడా ఇదే.

ఇక ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు వరల్డ్ లో ఉన్న సినిమా అభిమానులంతా ‘సాహో’ గురించి వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అందరిలో ఒకటే సందేహం ‘సాహో’తో ప్రభాస్ మళ్ళీ మేజిక్ రీపేట్ చేస్తాడా.. ఇప్పుడు పల్లెటూరి నుండి యూ.ఎస్ వరకూ ఇదే హాట్ టాపిక్. మరో ఐదు రోజుల్లో థియేటర్స్ లో ఓ రేంజ్ లో సందడి చేయనున్న ‘సాహో’ ప్రేక్షకులకు ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ని ఇస్తుందో.. తెలియాలంటే ఈ నెల ముప్పై వరకూ వెయిట్ చేయాల్సిందే.
Please Read Disclaimer