ఖాన్ లతో కానిదీ.. మన డార్లింగ్ సాధించాడు

0

పల్లెటూళ్లలోని టూరింగ్ టాకీస్.. పట్టణాల్లోని ఏసీ థియేటర్.. హైదరాబాద్ లోని మహేష్ ఏఎంబీ థియేటర్స్.. ఇందులో ఏది పెద్దది అంటే సహజంగానే హైదరాబాద్ లోనే అత్యాధునిక వసతులతో నిర్మించి ఏఎంబీ థియేటరే పెద్దదని అని చెబుతారు. అయితే ప్రపంచంలోనే పెద్ద థియేటర్ ఎక్కడుంది మరీ… దాని విశిష్టత ఏంటీ.. ఆ థియేటర్లో మన సినిమాలు ఆడుతాయా.? ఇలా ఎన్నో ప్రశ్నలున్నాయి..

ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్ ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరంలో ఉంది. దాని పేరు ‘లే గ్రాండ్ రెక్స్’ మన థియేటర్లలో మహా అయితే 800-1200 మంది గరిష్టంగా సినిమా చూసేలా సీటింగ్ ఉంటుంది. కానీ ది గ్రాండ్ రెక్స్ కెపాసిటీ ఎంతో తెలుసా.? 2800 సీట్లు. ఎంతో చరిత్ర గొప్పతనం ఉన్న ఈ పేద్ద థియేటర్లో భారతీయ సినిమాలు ఆడిందే తక్కువ. ఆ అదృష్టం అన్నీ సినిమాలకు దక్కదు. ఒకవేళ దక్కిందంటే అదో గొప్ప సినిమా కిందే లెక్క అని సినీ పండితులు చెబుతుంటారు..

ఇప్పటి వరకు బాలీవుడ్ ను ఏలుతున్న ముగ్గురు ఖాన్ ల సినిమాలు ఇందులో ఆడలేదు. ప్రతిష్టాత్మక ప్రపంచ మెప్పు పొందే సినిమాలను మాత్రమే దీనిలో ప్రదర్శిస్తారు. సరే ఈ థియేటర్లో ఆడిన భారతీయు సినిమాలున్నాయా అంటే ఉన్నాయి. అవి మూడే.. అవి సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కబాలీ’. రెండోది మన ప్రభాస్ నటించిన బాహుబలి. మూడోది తమిళ హీరో విజయ్ నటించిన ‘మెర్శల్’. ఈ మూడు చిత్రాలకు మాత్రమే ‘లే గ్రాండ్ రెక్స్’లో ప్రదర్శించే అదృష్టం దక్కింది.

ఇప్పుడు నాలుగో భారతీయ సినిమాకు ఆ అవకాశం దక్కింది. అదే ‘సాహో’. ఈ చిత్రం ప్రదర్శనకు రెక్స్ థియేటర్ సిద్ధమైంది. సాహో ప్రదర్శనతో మన డార్లింగ్ ప్రభాస్ కొత్త రికార్డులు బద్దలు కొట్టబోతున్నారు. ఎందుకంటే వరుసగా బాహుబలి సాహో రెండు సినిమాలను ఈ అతిపెద్ద థియేటర్లో ప్రదర్శించబోతున్నారు. బాలీవుడ్ హీరోల ఒక్క సినిమా కూడా ప్రదర్శనకు నోచుకోని ఈ థియేటర్లో మన ప్రభాస్ నటించిన వరుసగా రెండు సినిమాలు ఆడుతుండడం ప్రభాస్ కు దక్కిన గొప్ప గౌరవంగా టాలీవుడ్ ప్రముఖులు అభివర్ణిస్తున్నారు.

బాహుబలిని తలదన్నేలా ప్రభాస్ తాజాగా తెరకెక్కించిన ‘సాహో’ చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈనెల 30న పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోంది. భారీ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ అయిన దీన్ని ప్రపంచవ్యాప్తంగా 10వేల స్కీన్లకు పైగా ప్రదర్శిస్తున్నారు. అందులోనే ప్రపంచంలోనే అతి పెద్ద థియేటర్ ‘లే గ్రాండ్ రెక్స్’ కూడా ఉండడం విశేషంగా చెప్పవచ్చు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home