100 మంది కాళకేయుల్ని ఢీకొట్టినట్టుగా!

0

ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ `సాహో` ఈనెల 30న అత్యంత ప్రతిష్ఠాత్మకంగా థియేటర్లలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కి మరో ఎనిమిది రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ కొద్ది కాలం ఫ్యాన్స్ టెన్షన్ తో అంతకంతకు వేడెక్కిపోతున్నారు. ఈ వేడి మరింతగా పెంచేందుకా అన్నట్టు ఎప్పటికప్పుడు సాహోకి సంబంధించిన కొత్త పోస్టర్లు రిలీజ్ చేస్తూ యు.వి.క్రియేషన్స్ బృందం వేడి పెంచుతోంది.

ఇప్పటివరకూ రిలీజైన ప్రతి పోస్టర్ లో డార్లింగ్ రకరకాల కోణాల్లో కనిపించి ఆకట్టుకున్నారు. ప్రభాస్ మ్యానరిజమ్స్ ని స్టైలిష్ యాటిట్యూడ్ ని .. రొమాంటిక్ యాంగిల్ ని పోస్టర్లు ఎలివేట్ చేశాయి. తాజాగా రివీల్ చేసిన పోస్టర్ లో విలన్ల గుంపు ను చెల్లా చెదురు చేసే ఉగ్ర రూపం కనిపిస్తోంది. చేతుల్లో గొడ్డళ్లు పట్టుకుని వందమంది కాళకేయుల్లా విలన్లు ప్రభాస్ మీదికి దూసుకొస్తున్నారు. పోస్టర్ అంత సీరియస్ మోడ్ తో ఉత్కంఠ పెంచుతోంది. రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ మరిన్ని కొత్త పోస్టర్లు రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన విలన్లు నీల్ నితిన్ – జాకీ ష్రాఫ్- అరుణ్ విజయ్ – మందిరా భేడీ పోస్టర్లు ఆకట్టుకున్నాయి. శ్రద్ధాతో రొమాంటిక్ స్టిల్స్ ఫ్యాన్స్ లో కి దూసుకెళ్లాయి. ట్రైలర్- మేకింగ్ వీడియోలను కోట్లాది మంది వీక్షించారు.

ఇంత భారీ కాస్టింగ్ కి తగ్గట్టే ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్ విజువల్ రిచ్ లుక్ తో ఆకట్టుకోనుందని అర్థమవుతోంది. దుబాయ్ – అబుదబీ లాంటి చోట్ల భారీ పోరాట దృశ్యాల్ని .. ఛేజ్ సీన్లను తెరకెక్కించారు. అవన్నీ సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో సుధీర్ఘమైన ఫైట్ గగుర్పాటుకు గురి చేస్తుందని చెబుతున్నారు.
Please Read Disclaimer