ఏమాత్రం భయం బెంగ లేదా డార్లింగ్?

0

ప్రపంచం మొత్తం ఒక వైపు వెళుతుంటే .. డార్లింగ్ ఒక్కడే ఇంకో వైపు వెళుతున్నాడు. కరోనా కరోనా అంటూ జనం బెంబేలెత్తిపోతుంటే .. అదేమీ పట్టనట్టు ఎంత ధీమాగా కనిపిస్తున్నాడో చూడండి. వద్దు వద్దు అంటున్నా.. ఏమవుతుందోనని ఫ్యాన్స్ బెంగ పెట్టుకుంటున్నా.. అదేమీ పట్టించుకోకుండా ప్రభాస్ యూరప్ లో షూటింగులకు ఎటెండవుతున్నాడు. కరోనానే ఎదిరించే ధీరత్వం చూపిస్తున్నాడు.

ప్రస్తుతం జార్జియాలో షూటింగుల్లో పాల్గొంటున్నాడు. జార్జియా అంటే రాత్రులు మైనస్ డిగ్రీల చలి ఉంటుంది. మంచు దుప్పటి కప్పేస్తుంది. అందుకే ఇదిగో ఇలా బ్లాక్ జర్కిన్ తొడుక్కుని టాప్ టు బాటమ్ ఇలా కప్పేశాడు. తలకు మంకీ క్యాప్ కూడా పెట్టేశాడు. ఇక అక్కడ తన టీమ్ తోనో అభిమానులతోనో ఇలా ఫోజిచ్చేశాడు. డార్లింగ్ ని చూస్తుంటే నేను క్షేమం.. మీరు క్షేమమా? అని ప్రశ్నిస్తున్నట్టే ఉంది. ఇక కరోనాపై తప్పుడు ప్రచారం జరిగిపోతోంది. ఫేక్ ఏదో తెలుసుకుని ధైర్యంగా ఉండమని ఓ సందేశం పంపి అందరి మనసు దోచాడు ప్రభాస్. అయినా ఇంకా ఏదో సందిగ్ధత అభిమానుల మెదడు తొలిచేస్తోంది.

చలిలో కరోనా కల్లోలం ఆషామాషీగా ఉండదు. వైరస్ వ్యాప్తికి అనుకూలమైన ప్రాంతాలుగా యూరప్ దేశాల్ని ప్రపంచం గుర్తించింది. అయినా ఏమిటో ప్రభాస్ లో ఈ ధీమా. ప్రస్తుతానికి డార్లింగ్ సేఫ్ అయినా భవిష్యత్ ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఉంది. ఇప్పుడు అన్ని దేశాలు అన్ని రహదారుల్ని మూసేసి.. రోడ్.. ఫ్లైట్ మార్గాల్ని కూడా బంద్ చేసేస్తుంటే ధీమాగా షూటింగ్ చేసుకుని ఎప్పటికి తిరిగి రావాలనుకుంటున్నాడో కానీ డార్లింగ్ ప్లానేంటో! ఇప్పటికి షూటింగ్ బంద్ చేసి స్వదేశానికి తిరిగి రావాల్సిందిగా ఫిలింఛాంబర్ వర్గాలు కోరాయి కానీ ప్రభాస్ వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. జాన్ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి రిలీజ్ చేసేయాలన్న ప్లాన్ లో ఉన్నారు. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తయిందని రాధాకృష్ణ కుమార్ వెల్లడించారు. ఫస్ట్ లుక్ లాంచ్ కి టీమ్ సిద్ధమవుతోందని తెలిపారు. ఇక జాన్ లో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందో ఇదిగో ఈ గెటప్ చూస్తుంటేనే అర్థమవుతోంది. ఇంతకుముందు ప్రభాస్ స్లిమ్ అయినా మళ్లీ నెమ్మదిగా బరువు పెరుగుతున్నట్టే కనిపిస్తోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-