‘అర్జున్ రెడ్డి’ దర్శకుడి తో డార్లింగ్ నిజమెంత ?

0

టాలీవుడ్ లో ప్రభాస్ రేంజ్ వేరు… బాహుబలి తర్వాత టాప్ చేర్ లో సెటిల్ అయిపోయాడు డార్లింగ్. లేటెస్ట్ గా ‘సాహో’ లాంటి ఫ్లాప్ సినిమాతో కూడా హిందీ మార్కెట్ లో వంద కోట్లు కొల్లగొట్టి తన స్టామినా ఏంటో నిరూపించాడు. అందుకే ఇప్పుడు టాలీవుడ్ నిర్మాణ సంస్థలన్నీ ప్రభాస్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే దిల్ రాజు తో పాటు మైత్రి మూవీ మేకర్స్ కూడా ప్రభాస్ తో సినిమా నిర్మించాలనే ఆలోచనలో ఉంది.

తాజాగా టీ సిరీస్ తో ప్రభాస్ ఓ సినిమా కమిట్ అయ్యాడట. అయితే ఆ సంస్థ సోలోగా కాకుండా మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి ప్రభాస్ తో సినిమా నిర్మించందట. ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే కనుక దర్శకుడిగా ‘అర్జున్ రెడ్డి’ ఫేం సందీప్ వంగ ఫిక్సయినట్టే. ఎనుకంటే కబీర్ సింగ్ తర్వాత టీ సిరీస్ బ్యానర్ నుండి అడ్వాన్స్ అందుకున్నాడు సందీప్. అలాగే మైత్రి మూవీ మేకర్స్ కూడా సందీప్ కి ఇదివరకే మహేష్ సినిమా కోసం ఓ అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు.

సో ఈ రెండు అడ్వాన్సులు సందీప్ దగ్గర ఉండటంతో ప్రభాస్ సినిమాకు ఇతడే బెస్ట్ ఆప్షన్. పైగా హిందీ మార్కెట్ లో కూడా సందీప్ తన సత్తా చాటాడు. కబీర్ సింగ్ తో ఏకంగా వంద కోట్లు సాదించాడు. ఏదేమైనా ‘జాన్ ‘ ఓ కొలిక్కి వచ్చే వరకూ ప్రభాస్ నెక్స్ట్ సినిమా పై క్లారిటీ రాదు.
Please Read Disclaimer