తగ్గించమన్న ప్రభాస్.. సరేనన్న దర్శకుడు!

0

అదిపనిగా ఒకే పని చేస్తుంటే ఎవరికైనా కాస్త చిరాకు పుట్టడం ఖాయం. ప్రస్తుతం మన డార్లింగ్ ప్రభాస్ పరిస్థితి అలాగే ఉందట. యాక్షన్ సీక్వెన్సులు అంటే చాలు.. వద్దుబాబోయ్ అనేలా ఉన్నాడట. ‘బాహుబలి’ రెండు భాగాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం నటిస్తున్న’సాహో’ పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్.. హాలీవుడ్ రేంజ్ స్టంట్స్ ఉన్నాయి. దీంతో కంటిన్యూగా ఏళ్ళ తరబడి యాక్షన్ స్టంట్స్ చేస్తూ ఉండడంతో ఆ ఇంపాక్ట్ తన నెక్స్ట్ సినిమాపై పడిందట.

‘సాహో’ తో పాటుగా ప్రభాస్ మరో చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ‘జిల్’ ఫేం రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. ఇదొక పీరియడ్ లవ్ స్టొరీ అయినప్పటికీ యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయట. కానీ భారీ యాక్షన్ సీన్స్ లో నటించే ఉద్దేశం ప్రభాస్ కు లేకపోవడంతో యాక్షన్ పార్ట్ ను తగ్గించమని దర్శకుడికి చెప్పాడట. ఈ సినిమా ఒక లవ్ స్టొరీ కదా.. అందుకే యాక్షన్ పార్ట్ ను తగ్గించినా పెద్దగా డిఫరెన్స్ ఉండదు కాబట్టి స్క్రిప్ట్ లో కొంత మార్పు చేసి సింపుల్ ఫైట్స్ ఉండేలా చేశాడట దర్శకుడు. ముఖ్యంగా రెండు యాక్షన్ సీక్వెన్సులను తొలగించారట. అంటే.. ఈ సినిమాలో ఫైట్స్ ఉంటాయి కానీ భారీ యాక్షన్ బ్లాక్స్ మాత్రం ఉండవు.

ఫైట్స్ చేసి చేసి విరక్తి పుట్టిన డార్లింగ్ ఇలా యాక్షన్ పార్ట్ తగ్గించమన్నాడు.. అది సరేగానీ విజయ్ దేవరకొండకు ఎన్ని లిప్ లాకులు లాగించినా విసుగుపుట్టడం లేదెందుకు? ప్రభాస్ యాక్షన్ పార్ట్ తగ్గించమని చెప్పినట్టు.. కిస్సింగ్ పార్ట్ కాస్త తగ్గించమని రౌడీగారు దర్శకులకు చెప్పొచ్చుగా..!
Please Read Disclaimer