తంబీలను ఐస్ చేసిన డార్లింగ్

0

సాహో విడుదలకు ఇంకో 13 రోజులే ఉన్న నేపథ్యంలో యూనిట్ ప్రమోషన్ వేగాన్ని పెంచింది. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ కావడంతో ఎక్కడికక్కడ కనివిని ఎరుగని స్థాయిలో రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిన్న చెన్నై వెళ్లిన సాహో టీమ్ అక్కడ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యింది. మాములుగా మన తెలుగు మాట్లాడేందుకే కొందరు టాలీవుడ్ హీరోలు కిందా మీద పడిపోయి మధ్యలో ఫుల్ గా ఇంగ్లీష్ కలిపేస్తుంటారు. అలాంటిది తమిళ్ లో అంటే కనీసం ఆలోచన కూడా రాదేమో.

కానీ ప్రభాస్ కు ఆ ఇబ్బంది ఎదురు కాలేదు. శుభ్రంగా స్వచ్ఛమైన తమిళ్ లో యాంకర్ వరసబెట్టి ప్రశ్నలు అడుగుతున్నా తడబడకుండా స్టేజి మీద చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడిన తీరు అక్కడి ఫ్యాన్స్ మనసులను పూర్తిగా గెలిచేసుకుంది. పుట్టింది ఇక్కడే కాబట్టి తనకు చెన్నైతో అనుబంధాన్ని ప్రభాస్ హై లైట్ చేశాడు. బాహుబలి తర్వాత తన మీద వచ్చిన ఒత్తిడి గురించి సాహో నిర్మాణంలో ఆలస్యం గురించి విదేశాల్లో షూటింగ్ చేయడం గురించి అన్ని తమిళ్ లోనే డార్లింగ్ ఆన్సర్స్ ఇవ్వడం విశేషం

30న విడుదల కానున్న సాహో ఇంకా కర్ణాటక కేరళ ట్రిప్ బాలన్స్ ఉంది. త్వరలోనే దాన్నీ ప్లాన్ చేస్తున్నారు. రేపు హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యాక వాటి డేట్లు బయటికి రాబోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్ సైతం వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా మొదలుపెట్టబోతున్నారు. ఆరోజు తెలుగు రాష్ట్రాల థియేటర్లన్నీ సాహోతో నిండటం ఖాయంగా కనిపిస్తోంది.

ఎగ్జిబిటర్లు దానికి తగ్గట్టే ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఓపెనింగ్స్ లో బాహుబలి రికార్డు బ్రేక్ చేస్తుందన్న నమ్మకమైతే యూనిట్ లోనూ ఫ్యాన్స్ లోనూ పుష్కలంగా కనిపిస్తోంది. మరి దాన్ని నిలబెట్టుకునే దిశగా సాహో అంచనాలు ఎంతవరకు అందుకుంటుందో తెలియాలంటే రెండు వారాల కంటే తక్కువ వ్యవధి వెయిట్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం
Please Read Disclaimer