ప్రభాస్20 ప్రశ్నలకు ఆరోజే ఆన్సర్ దొరకనుంది

0

ప్రభాస్ సాహో తర్వాత చేస్తున్న పీరియాడిక్ రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రంపై తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు ఆసక్తి ఉంది. స్టైలిష్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఈ సినిమాను చేస్తున్నాడు. మొన్నటి వరకు ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. జాన్ ను వర్కింగ్ టైటిల్ అనుకున్నారు. కాని ఇప్పుడు టైటిల్ ను మార్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఓ డియర్ తో పాటు ఇంకా రెండు మూడు పేర్లు ప్రముఖం గా వినిపిస్తున్నాయి. ప్రభాస్ 21 చిత్రం ప్రారంభం అయ్యి చాలా నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కనీసం ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయక పోవడంపై ఫ్యాన్స్ చాలా రోజులుగా అసహనం తో ఉన్నారు. సినిమా విడుదల కూడా ఇప్పటికే ఉండాల్సి ఉన్నా కూడా ఏదో కారణం చెబుతూ వాయిదా వేస్తున్నారని ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యం లో ఉగాదికి ప్రభాస్ ఫ్యాన్స్ కు ట్రీట్ ను యూనిట్ సభ్యులు రెడీ చేశారు.

మార్చి 25 అయిన ఉగాది రోజున ప్రభాస్ 20 చిత్రం గురించి ఇన్ని రోజులు ప్రేక్షకుల్లో ఉన్న ప్రశ్నలు.. మీడియాలో ప్రసారం అవుతున్న పుకార్లన్నింటికి సమాధానం లభించబోతుంది. ఆ రోజు టైటిల్ ను రివీల్ చేయడంతో పాటు ప్రభాస్ లుక్ ను రివీల్ చేయబోతున్నారు. ప్రభాస్ కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. కాని ఫస్ట్ లుక్ ను చూస్తే ఆ కిక్ వేరుగా ఉంటుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం యూరప్ లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఇటీవలే ఒక అద్బుతమైన చేజింగ్ సీన్ ను అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్ తో చేశామంటూ దర్శకుడు రాధాకృష్ణ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకా యూరప్ లో చిత్రీకరణ చేస్తున్నట్లుగా కూడా ఆయన పేర్కొన్నాడు. ఉగాది వరకు అక్కడే షూటింగ్ ఉండే అవకాశం ఉందని సమాచారం. సినిమాను దసరా కు విడుదల చేస్తారా లేదంటే ఎప్పుడు విడుదల చేస్తారు అనే ప్రశ్నకు కూడా ఉగాది రోజు సమాధానం దొరికే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-