సౌత్ నుంచి వెళ్లి రఫ్ఫాడించేస్తున్నాడు!

0

ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరో సల్మాన్ ఖాన్ ని డైరెక్ట్ చేసే అవకాశం ఒక్కసారి కలిగినా అది గొప్ప వరం అని భావిస్తారు. ఎంతో ప్రతిభ ఉన్నా అదృష్టం కలిసొస్తేనే భాయ్ ని లాక్ చేయడం కుదురుతుంది. అలా లాక్ చేయాలంటే కబీర్ ఖాన్.. అలీ అబ్బాస్ జాఫర్ లాంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్లకే సాధ్యం. కానీ ఇప్పుడు ఈ లీగ్ లో సౌత్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రభుదేవా చేరారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా భాయ్ నటించే మూడు సినిమాల్ని లాక్ చేశారు ప్రభుదేవా. వీటిలో ఒకటి రిలీజైంది. ఇంకోటి సెట్స్ పై ఉంది. మరొకటి ప్రారంభం కావాల్సి ఉంది.

ఇటీవలే భాయ్ దబాంగ్-3 తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ సెట్స్ లో ఉండగానే `రాధే` అంటూ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని సల్మాన్ – ప్రభుదేవా జోడీ పట్టాలెక్కించారు. లవ్ రొమాన్స్.. యాక్షన్ కలగలిపి పూర్తి స్థాయి ఎంటర్ టైనర్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. సల్మాన్ భారీ కటౌట్ కి తగ్టట్టు ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలు సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని కథనాలొచ్చాయి. దబాంగ్ -3 సక్సెస్ తో రాధేపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఇక బాలీవుడ్ లో ప్రభుదేవాకి వరుస అవకాశాలు వెంట వస్తున్నాయని తెలుస్తోంది. తాజాగా `ఏక్ థా టైగర్` ప్రాంచైజీలో పార్ట్ 3 ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కిందని వార్తలొస్తున్నాయి. ఈ భారీ యాక్షన్ సిరీస్ లో మొదటి భాగాన్ని కబీర్ ఖాన్.. రెండవ భాగాన్ని అబ్బాస్ అలీ తెరకెక్కించి బ్లాక్ బస్లర్లు కొట్టారు.

ఇప్పుడు మూడో భాగాన్ని డైరెక్ట్ చేసే అవకాశం ప్రభుదేవాని వెతుక్కుంటూ వచ్చిందన్న వార్త వెడెక్కిస్తోంది. సక్సెస్ ఈ ఛాన్స్ తెచ్చిపెట్టింది. రాధే రిలీజై సక్సెస్ అయితే రెట్టింపు ఉత్సాహంతో ఏక్ థా టైగర్ 3ని ప్రారంభించేస్తారు. ఇక సల్మాన్ భాయ్ ని డైరెక్ట్ చేయాలని.. తనతో సినిమా చేయాలని అతడి సోదరుడు సోహైల్ ఖాన్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నాడు. అయినా తమ్ముడిని కాదని ప్రభుదేవాకే భాయ్ అవకాశం ఇవ్వడం చూస్తుంటే… సౌత్ నుంచి వెళ్లి మనోడు రఫ్ఫాడేస్తున్నాడంటే అతిశయోక్తి కాదేమో!
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-