ప్రభుదేవా సీక్రెట్ పెళ్లి ఎవరితోనో తెలిస్తే షాక్ తింటారు!

0

గతంలో ప్రభు దేవా తన మేనకోడలిని రెండో వివాహం చేసుకున్నట్లు పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ వార్తలు నిజం కాదని తేలింది. ఆయన తన ఫిజియోథెరపిస్ట్ ని పెళ్లాడారని తాజా నివేదికలు చెబుతున్నాయి.

కొరియోగ్రాఫర్ టర్న్ డ్ డైరెక్టర్ ప్రభుదేవా తన ఫిజియోథెరపిస్ట్ ను ముంబైలో వివాహం చేసుకున్నట్లు సమాచారం. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. సెప్టెంబరులో ఈ వివాహం జరిగిందని తెలుస్తోంది.

ముంబైలో సీక్రెట్ పెళ్లి తరువాత ఆ జంట చెన్నైకి వెళ్లారు. ప్రభు ప్రతిదీ హంగామా లేకుండా ఉండాలని కోరుకున్నారు. అందుకే ఈ వ్యవహారం బయటపడలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

తీవ్రమైన వెన్నునొప్పి వచ్చిన తరువాత ప్రభుదేవా తన ఫిజియోథెరపిస్ట్ ను ముంబైలో కలిశారని ఆ క్రమంలోనే ఆ ఇద్దరికీ మన్మథ బాణం గుచ్చుకుందని నెటిజనుల్లో సెటైరికల్ కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రేమలో పడిన తర్వాత వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇది సాంప్రదాయ వివాహం అని తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరూ దీనిని పెద్ద వ్యవహారంగా మార్చాలని నిర్ణయించుకున్నారు.

అంతకుముందు ప్రభుదేవా తన మేనకోడలిని వివాహం చేసుకున్నట్లు కొన్ని ఇబ్బందికరమైన వార్తలు షికార్ చేశాయి. అలాంటి పుకార్లన్నింటినీ ఖండిస్తూ.. అదంతా అబద్ధం అని ప్రూవ్ చేస్తూ ప్రభుదేవా ఫిజియోథెరపిస్ట్ ను వివాహం చేసుకున్నాడట.

ప్రభుదేవాకు ఇది రెండో వివాహం. అతను ఇంతకుముందు రామ్ లతా అక లతాని పెళ్లాడారు. అటుపై అందాల కథానాయిక నయనతారతో ప్రభు ప్రేమాయణం అనంతర పరిణామాలు తెలిసినదే. అయితే శ్రీరామరాజ్యం సమయంలో నయనతార ఎమోషన్ ని తెలుగు ఆడియెన్ మరువలేరు. అయితే ప్రభుదేవాని పెళ్లాడేస్తుందని భావిస్తే ఆ బంధం వీగిపోయింది. మొదటి భార్య దానిని అంగీకరించలేదు. అయితే ప్రభు మాత్రం ఇప్పటికీ సోలోగానే ఉండిపోవడం పై గుసగుసలు వినిపించాయి. తాజాగా అతడి రెండో వివాహం హాట్ టాపిక్ గా మారింది.

కెరీర్ సంగతి చూస్తే.. సల్మాన్ ఖాన్ హీరోగా `రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్` చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. ఈద్ కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది.