ఎట్టకేలకు కనిపించిన ప్రదీప్.. అసలు విషయం వెళ్లడి

0

యాంకర్ ప్రదీప్ గత నెల రోజులు గా కనిపించడం లేదు అంటూ ఆయన అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. ప్రదీప్ కు ఏమైంది అంటూ అభిమానులు ఆందోళనలో మునిగి పోయారు. కొందరు అనారోగ్య కారణం అంటూ ప్రచారం చేస్తే మరి కొందరు ప్రదీప్ కు యాక్సిడెంట్ అంటూ సోషల్ మీడియా లో ప్రచారం చేశారు. కొందరు ప్రదీప్ పెళ్లి చేసుకుంటున్నాడని అందుకే షోలకు కొన్నాళ్ల పాటు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాడు అంటూ పుకార్లు పుట్టుకు వచ్చాయి. వాటన్నింటి కి ఫుల్ స్టాప్ పెట్టి ప్రదీప్ ఎట్టకేలకు కనిపించాడు.

సోషల్ మీడియాలో ఒక వీడియోను ప్రదీప్ పోస్ట్ చేసి తాను క్షేమంగా ఉన్నట్లుగా ప్రకటించాడు. తన గురించి గత కొన్ని రోజులుగా ఆందోళన పడుతున్న వారి కోసం ప్రదీప్ ఈ ప్రకటన చేశాడు. నాకు ఏమైందా అంటూ బాధపడ్డ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నెల రోజులుగా ఇంట్లో రెస్ట్ తీసుకున్నాను. నా కాలికి షూట్ సమయంలో చిన్న ప్రాశ్చర్ అయ్యింది. అయినా కూడా షూట్స్ లో పాల్గొంటున్న కారణంగా అది ఇబ్బంది పెట్టింది. ఎక్కువ సమయం నిల్చుని ఉండటం వల్ల ఆ గాయం ఎప్పటికి అలాగే ఉంటుందని డాక్టర్లు చెప్పడంతో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాను.

గత నాలుగు అయిదు వారాలుగా కాళును అలా పైకి పెట్టి టీవీ చూస్తూ కూర్చున్నాను. మరో ఒకటి రెండు వారాల్లో షూట్ లో జాయిన్ అవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు. షూటింగ్స్ ను చాలా మిస్ అయ్యాను. ఈమద్య కాలంలో ఇంత బ్రేక్ తీసుకోవడం ఇదే. చాలా ఇబ్బందిగానే అనిపించినా తప్పలేదు అంటూ సదరాగా వ్యాఖ్యలు చేశాడు. ఈ నెల రోజుల్లో గడ్డం మీసాలు బాగా పెంచానంటూ కామెడీ చేశాడు.

బుల్లి తెరపై ఎంటర్ టైన్ చేసినట్లుగానే ఆ వీడియోలో కూడా చాలా సరదాగా మాట్లాడుతూ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునేలా చేశాడు. మొత్తానికి కాలుకు అయిన చిన్న గాయం కారణంగా బ్రేక్ తీసుకున్నట్లుగా చెప్పిన ప్రదీప్ అతి త్వరలోనే మళ్లీ బుల్లి తెరపై సందడి చేయడం కన్ఫర్మ్ అంటూ ప్రకటించాడు. ప్రదీప్ ప్రకటనతో ఫ్యాన్స్ అంతా హ్యాపీ. ప్రదీప్ వీడియో రావడం తో ఇక పుకార్లకు చెక్ పడ్డట్లే.
Please Read Disclaimer