ఇంకా కనిపించని ప్రదీప్.. అనారోగ్య కారణం కాదా?

0

బుల్లి తెర స్టార్ అంటూ అభిమానులు ఎంతో అభిమానంగా పిలుచుకునే ప్రదీప్ గత కొంత కాలంగా పూర్తిగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి పోయాడు. ఆయన చేస్తున్న షోల్లో వేరే వారు కనిపించడంతో పాటు చాలా రోజులుగా ఆయన సోషల్ మీడియా పేజీలల్లో కూడా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రదీప్ అక్కడ కూడా కనిపించక పోవడంతో అభిమానుల్లో ఆందోళన అంతకంతకు పెరిగి పోతూనే ఉంది. గత కొన్ని రోజులుగా ప్రదీప్ కు ఏమైంది అంటూ సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

కొన్ని వారాల ముందు యాంకర్ రవి మాట్లాడుతూ త్వరలోనే ప్రదీప్ వస్తాడని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు. దాంతో త్వరలోనే యాంకర్ ప్రదీప్ వస్తాడని ఆయన అభిమానులు ఎదురు చూశారు. కాని ఇంకా కూడా ప్రదీప్ బుల్లి తెరపై కాని సోషల్ మీడియాలో కాని కనిపించడం లేదు. దాంతో ఆయన ఫ్యాన్స్ లో ఆందోళన పీక్స్ కు వెళ్తోంది. అసలు ప్రదీప్ కు ఏమైంది అంటూ ఆందోళన చెందుతున్నారు. అనారోగ్య పరిస్థితి అయితే ఇన్ని రోజులు బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆమద్య డెంగ్యూ అన్నారు. అదే నిజం అయితే ఈపాటికి రికవర్ అయ్యి మళ్లీ తిరిగి రావాలి.

ఆరోగ్యం బాగాలేకుంటే సోషల్ మీడియాలో అయినా చిన్న పోస్ట్ పెట్టాలి. కాని ఇప్పటి వరకు ప్రదీప్ సోషల్ మీడియా ద్వారా స్పందించిందే లేదు. దాంతో అనారోగ్య కారణం కాకుండా మరేదైనా కారణం ఉందేమో అంటూ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి యాంకర్ ప్రదీప్ లేని లోటు బాగా తెలుస్తుంది అంటూ బుల్లి తెర ప్రేక్షకులు అంటున్నారు.

పలు రియాల్టీ షోలతో పాటు అవార్డు ఫంక్షన్స్.. ఇతరత్ర సినిమా వేడుకల్లో కూడా ప్రదీప్ స్టేజ్ పై వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ ఉంటాడు. ప్రదీప్ లేడీ ఫ్యాన్స్ ను అధికంగా కలిగి ఉంటాడు. వారంతా కూడా ప్రదీప్ కోసం లక్షల కళ్లతో ఎదురు చూస్తున్నారట. మరి వారికోసమైనా ప్రదీప్ తన ప్రస్తుత పరిస్థితిని.. బ్రేక్ కు కారణంను వివరిస్తే బాగుంటుంది.
Please Read Disclaimer