వీపు చూడు వీపందం చూడు

0

వీపు చూడు.. వీపందం చూడు! అన్నాడో సినీ కవి. ఆ మాటల్ని వంట బట్టించుకుందో ఏమోగానీ జబల్ పూర్ చిన్నది ప్రగ్యా జైస్వాల్ వీపు విమానం మోత మోగిస్తోంది. ఈ అమ్మడు తన వీపును చూపిస్తూ సినిమా వాళ్లకు గాలం వేస్తోంది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్న అర్థం ధ్వనిస్తోంది ఇందులో. క్రిష్ రూపొందించిన స్క్రీన్ప్లే మ్యాజికల్ మూవీ `కంచె` చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ప్రగ్యాకు ఆరంభమే మంచి పేరొచ్చినా ఆ స్థాయిలో మాత్రం అవకాశాల్ని అందించలేకపోయింది. సాఫ్ట్ హీరోయిన్ గా ముద్ద పడటంతో దాన్నుంచి బయటపడటం కోసం ప్రత్యేక గీతంలో హాటుగా నటించినా ఫలితం లేకుండా పోయింది. పంథా మార్చి నక్షత్రం.. గుంటూరోడు.. ఆచారి అమెరికా యాత్ర వంటి చిత్రాల్లో నటించినా ఏ మాత్రం లాభం లేకుండా పోయింది.

దీంతో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. ఎంత హాటుగా కనిపిస్తే అంతగా అవకాశాలు వస్తాయని భావించిందో ఏమో తెలీదు కానీ సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో తన హాట్ ఫొటోలతో రెచ్చిపోతూ ఫిల్మ్ పర్సనాలిటీస్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. దీని కోసం టీమ్ ప్రగ్యా పేరుతో ఇన్ స్టాగ్రామ్ లో ప్రత్యేకంగా ఓ పేజీని మెయింటైన్ చేస్తూ గాలం వేస్తోంది.

వీపు చూడు నా వీపందం చూడు అంటూ ఇన్ స్టాలో పెట్టిన ఫొటోలు వైరల్ గా మారుతూ నెటిజన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. కనీసం ఇలా అయినా ప్రగ్యాకు అవకాశాలు వస్తాయోమో చూడాలని అంతా కామెంట్లు పెడుతున్నారు. అన్నట్టు ప్రగ్యా త్వరలో ఓ భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిరంజీవి నటిస్తున్న `సైరా నరసింహారెడ్డి` చిత్రంలో ప్రగ్యా నటిస్తోందని ప్రచారమైంది. అయితే ఇందులో తన లుక్ ఎలా ఉంటుంది? అన్నది రివీల్ కాలేదింకా.
Please Read Disclaimer