భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం - LIVE

ఇంతగా ఆరబోసినా ఫేట్ మారదేమిటో!

0

వేడెక్కించే ఫోటోషూట్లతో నిరంతరం అంతర్జాలంలో హాట్ టాపిక్ గా మారుతోంది ప్రగ్య జైశ్వాల్. ఒక రకంగా సినిమాలతో కంటే ఫోటోషూట్లతోనే ఈ అమ్మడికి ఎక్కువ కాలక్షేపం అవుతోంది. గత కొంతకాలంగా ఆఫర్లు లేని ప్రగ్యను టాలీవుడ్ లో ప్రమోట్ చేసేవాళ్లే లేకపోవడం పెద్ద మైనస్ గా మారిందని చెప్పాలి. ప్రస్తుత సన్నివేశంలో ఫ్యాన్స్ లో ఏదో ఒక రకంగా చర్చల్లో ఉండాలంటే ఉన్న ఒకే వేదిక సోషల్ మీడియా. అక్కడ తన ఉనికిని చాటుకునేందుకు ప్రగ్య నానా పాట్లు పడుతోంది. ఒక రకంగా సోషల్ మీడియా వల్లనే ఈ ముంబై భామ ఇంకా లైమ్ లైట్ లో ఉంది.

కంచె .. ఆచారి అమెరికా యాత్ర లాంటి సినిమాల్లో నటించినా ఆ తర్వాత ఈ భామకు అస్సలు అవకాశం అన్నదే లేకుండా పోయింది. ఆ క్రమంలోనే వేడెక్కించే ఫోటోషూట్లతో దర్శకనిర్మాతలకు ఫీలర్స్ వదులుతూనే ఉంది. కానీ ఎందుకనో ఆఫర్లు మాత్రం దక్కడం లేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోలెవరూ ఈ అమ్మడికి పిలిచి అవకాశం అన్నదే ఇవ్వలేదు ఎందుకనో!

అయితే ఇటీవల ఈ అమ్మడి శ్రమ ఫలించేందుకు ఆస్కారం ఉందని .. క్రిష్ దర్శకత్వం వహించే తాజా చిత్రంలో ఆఫర్ దక్కనుందని ప్రచారమవుతోంది. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ తెరకెక్కిస్తున్న సినిమాలో ఏదైనా ఒక అథిధి పాత్రలో అయినా అవకాశం దక్కుతుందా? అన్న చర్చ అభిమానుల్లో సాగుతోంది. తదుపరి పవన్ నటించే సినిమాకి ఈ అమ్మడి పేరును రిఫర్ చేశారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ప్రగ్య కు ఇకనైనా గుడ్ టైమ్ వస్తుందేమో చూడాలి. బీచ్ లో వయ్యారాల వడ్డనలు చేసిన తాజా ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-