కంచె పాప బికినీ అదరహో!

0

హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ చేసింది తక్కువ సినిమాలే కానీ మొదటి సినిమా ‘కంచె’తోనే మంచి గుర్తింపు సాధించింది. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రంలో ప్రగ్య నటనకు ప్రశంసలు దక్కాయి. . ఆ సినిమా తర్వాత మంచి ఆఫర్లే వచ్చాయి కానీ ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచాయి. దీంతో ప్రగ్య కెరీర్ నత్తనడకన సాగుతోంది. అయితే ఆఫర్లు.. హిట్లు.. ఫ్లాపులతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లను కాల్చుకుతింటోంది.

రీసెంట్ గా ప్రగ్య తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “సన్ సెట్ స్టేట్ ఆఫ్ మైండ్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సాయం సమయంలో ఉన్నటుగా తన మనస్థితి ఉందని అంటోంది. ఇంతకంటే మీకు ఇంకా కాస్త ఎక్కువ అర్థం అయితే అర్థం చేసుకోండి. తప్పేమీ లేదు. మనం అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతోనే కంచె పాప ఇలాంటి క్యాప్షన్స్ పెడుతుంది. ఇక ఫోటో విషయానికి వస్తే హాఫ్ మాత్రమే ఉంది కానీ బికినీ అనే అర్థం చేసుకోవాలి. ఫోటో హాఫ్ అయినా ఫుల్ కంటే ఎక్కువలా ఉంది. ఆ హాఫ్ లోనే ఎంత గ్లామర్ ఒలికించాలో అంత ఒలికించింది. హాట్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. చేత్తో వయ్యారంగా జుత్తును సవరించుకుంటూ స్టైలిష్ పోజిచ్చింది. ఈ ఫోటోకు నేపథ్యం కూడా అదిరిపోయింది. సముద్రం.. భానుడి నారింజ రంగు కిరణాలు..ఆ కాంతిలో మెరుస్తున్న శిరోజాలు అదరహో.

ఈ ఫోటోకు పాయల్ రాజ్ పుత్.. సోనాల్ చౌహాన్ ఓ లైక్ వేసుకున్నారు. సాధారణ నెటిజన్లకు కూడా ఈ ఫోటో తెగనచ్చడంతో ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. “స్టన్నింగ్ బ్యూటీ కిల్లింగ్ లుక్స్”.. “బ్యూటిఫుల్ ఏంజెల్”.. “సూపర్ హాట్ ట్రాన్స్ ఫార్మేషన్” అంటూ కామెంట్లు పెట్టారు. ఈ రేంజ్ లో గ్లామర్ షో చేస్తూ ఉంటే కంచె పాపకు కొత్త ఆఫర్లు రావడం ఖాయమే.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home