నిక్కరులో నిరంతర శ్రామికురాలు

0

చిట్టి పొట్టి దుస్తుల్లో నిక్కరు నారాయణమ్మల హొయలు గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలీవుడ్ లో నటవారసురాళ్లు నిక్కరు కల్చర్ తో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. జిమ్ కి వెళ్లినా.. పబ్బుకి వెళ్లినా.. పబ్లిక్ లోకి వెళ్లినా ఎక్కడికి వెళ్లినా అందాల్ని ఓపెన్ చేసేందుకు ఏమాత్రం మొహమాటపడడం లేదు. పబ్లిక్ ని ఎంతగా కవ్విస్తే అంతగా ఫాలోయింగ్ పెరుగుతుందనే ఫార్ములాతో చెలరేగుతున్నారు. కేవలం నటవారసురాళ్లు మాత్రమేనా అంటే అసలు ముంబైలాంటి మెట్రోల నుంచి రంగుల ప్రపంచంలో అడుగు పెట్టే ప్రతి కథానాయిక ఈ తరహా పాశ్చాత్య సంస్కృతిని నరనరాన జీర్ణించుకుని మరీ వస్తున్నారు.

ఇదిగో కంచె బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ అందుకు మినహాయింపేమీ కాదు. ఇంతకుముందు సీకే బ్యూటీ దిశా పటానీతో పోటీపడుతూ ప్రగ్య లోదుస్తుల ఫోటోషూట్లతో అంతర్జాలాన్ని షేక్ చేసింది. కాంపిటీషన్ లో తనని కొట్టేవాళ్లే లేరు అన్నట్టుగా సోషల్ మీడియా ప్రచారంతో హెరెత్తించింది. ఇటీవలే ఛలో ప్యారిస్ అంటూ ఫ్యాషన్ ప్రపంచపు లోగిళ్లలోకి అడుగు పెట్టింది. అక్కడ ఏకంగా ఈఫిల్ టవర్ ముందు ఫోటోలు దిగి వాటిని ఇన్ స్టాలో షేర్ చేసింది. అవన్నీ అంతర్జాలంలో జోరుగా వైరల్ అయ్యాయి.

తాజాగా మరో కొత్త పోటోషూట్ ని ప్రగ్య తన అభిమానుల కోసం షేర్ చేసంది. టాప్ టు బాటమ్ వైట్ అండ్ వైట్ లో దిగిపోయింది అమ్మడు. పైగా నిక్కరు నారాయణమ్మను తలపించేలా వైట్ షార్ట్ తో యువతరం కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిచ్చింది. కంచె తర్వాత ఈ అమ్మడికి టాలీవుడ్ లో సరైన ఆఫర్ లేదు. ఇటీవల సైరా-నరసింహారెడ్డిలో నటిస్తోందంటూ బోలెడంత ప్రచారం సాగినా ఆ సినిమాలో కనిపించలేదు. ప్రస్తుతం ఇటు టాలీవుడ్ సహా అటు బాలీవుడ్ లోనూ అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ఇంతగా సోషల్ మీడియాలో చెలరేగుతున్నా ప్రగ్యను ఎవరూ ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. కనీసం ఇకనైనా మన దర్శకనిర్మాతలు ఈ నిరంతర శ్రామికురాలి కష్టాన్ని గుర్తిస్తారేమో చూడాలి.
Please Read Disclaimer