Templates by BIGtheme NET
Home >> Cinema News >> కుర్రకారుకు స్వయంగా అందాలను వడ్డిస్తున్న ప్రగ్యా జైస్వాల్!

కుర్రకారుకు స్వయంగా అందాలను వడ్డిస్తున్న ప్రగ్యా జైస్వాల్!


టాలీవుడ్ ఇండస్ట్రీలో తళుక్కున మెరిసి చటుక్కున మాయమైన ముద్దుగుమ్మలలో ఒకరు ప్రగ్యా జైస్వాల్. గ్లామర్ ఒలకబోయడంతో పాటు నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళ్తుంది. ‘డేగ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రగ్యా.. అదే సంవత్సరం ‘టిటు ఎంబిఏ’ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ ఫెయిర్ బ్యూటీ ‘కంచె’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. చివరగా 2018లో ఆచారి అమెరికా యాత్ర సినిమాలో కనబడింది. ఆ తర్వాత అమ్మడు మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయిన ఈ భామ ఎల్లప్పుడూ తన తాజా అందాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఆకలితో ఉన్న కుర్రకారుకి తన అందాల వడ్డిస్తోంది.

మాములుగా ప్రేక్షకులకు దగ్గరవడానికి ఆమె కనబరిచిన అందాల ఆరబోతే ప్రధాన కారణం. అప్పటి నుండి ప్రగ్యా ఏ మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక తెలుగు సినిమాలలో రెచ్చిపోతూ తన సోయగాలను దారపోసింది. ఇక తాజాగా ప్రగ్యా చేసిన ఫోటో షూట్ చూస్తే మాత్రం కుర్రాళ్లకు మతిపోవడం ఖాయం. మినీ స్కర్ట్ వేసుకొని అద్దం ముందు నిలబడి తానే స్వయంగా ఫోటో తీసుకుంది. ఆ ఫోటోలో నాజూకైన ప్రగ్యా పోజు చూస్తూ ఫిదా అయిపోతున్నారు అభిమానులు. పూల స్కర్టులో ముద్దబంతిలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఓ వైపు ఎద అందాలు.. మరో వైపు అరటి బోదెల్లాంటి థైస్ అందాలు.. కుర్రాళ్లను మతులు పోయేలా చేస్తున్నాయి. ప్రగ్యా పోజులు చూస్తున్న అభిమానులు కళ్ళు పక్కకు తిప్పుకోలేక పోతున్నారట. చూడాలి మరి త్వరలో మళ్లీ అమ్మడు తెలుగు తెరపై కనిపిస్తుందేమో..!!