అందాల విందు చేస్తుంటే జాలి పడుతున్నారు

0

ప్రగ్యా జైశ్వాల్ అనే ఉత్తరాది భామ ‘డేగ’ అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై.. తర్వాత ‘మిర్చి లాంటి కుర్రాడు’ అనే సినిమా చేసింది. కానీ ఈ రెండూ ఆమెకు గుర్తింపు తీసుకురాలేదు. కానీ క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘కంచె’లో అందం, అభినయంతో అందరినీ కట్టిపడేసి ఎక్కడ లేని గుర్తింపు తెచ్చుకుంది ప్రగ్యా.

ఎక్కడా తన తొలి రెండు సినిమాల ప్రస్తావన తేకుండా.. ‘కంచె’తోనే తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి ఆమె ట్రై చేసింది. చిత్రం ఈ సినిమాకు ఒక అవార్డుల కమిటీ ‘డెబ్యూ హీరోయిన్’గా పురస్కారం అందిస్తే సైలెంటుగా పుచ్చేసుకుంది కూడా. ‘కంచె’ ట్యాగ్‌తో స్టార్ అయిపోదామని ప్రయత్నించింది కానీ.. ఆమెకు కాలం కలిసి రాలేదు. మూణ్నాలుగు అవకాశాలు వచ్చాయి కానీ.. ఏవీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు.

దీంతో ‘కంచె’ వచ్చిన రెండు మూడేళ్లకు అవకాశాలు లేక ఖాళీ అయిపోయింది ప్రగ్యా. అలాగని ఆమె లైమ్ లైట్లో లేకుండా పోలేదు. టాలీవుడ్లో మరే హీరోయిన్ చేయలేని విధంగా ఫొటో షూట్లతో హోరెత్తించేస్తుంది. బాలీవుడ్ హీరోయిన్లకు దీటుగా హై క్లాస్ ఫొటో షూట్లు చేస్తోంది. తాజాగా బ్లూ డ్రెస్‌లో ఆమె చేసిన షూట్ చూస్తే వావ్ అనిపించకుండా ఉండదు. ఐతే ఇలాంటివి చూసినపుడల్లా అయ్యో అనిపిస్తోంది జనాలకు. నటిగా నిరూపించుకుంది.

ఇంత అందం ఉంది. అన్నీ ఉన్నా ఈ భామకు అవకాశాల్లేకపోవడమేంటి అని జనాలు బాధపడిపోతున్నారు. ప్రగ్యతో పోలిస్తే అందంలో, అభినయంలో తక్కువగా ఉన్న అమ్మాయిలు చాలామంది సినిమాల్లో వెలిగిపోతున్నారు. కానీ అన్నీ ఉండి కూడా కాలం కలిసి రాక చాలా వేగంగా ఫేడవుట్ అయిపోయింది ప్రగ్యా. మరి ఇంత టాలెంట్ ఉన్న ప్రగ్యాకు ఇంకో ఛాన్సిచ్చి ఆదుకునే ఫిలిం మేకర్ ఎవరో?
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-