కంగనా ఖాతాలో మరో హిట్.. ప్రకాష్ కు ఫస్ట్ హిట్!

0

కంగనా రనౌత్.. రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘జడ్జిమెంటల్ హై క్యా’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రిలీజ్ కు ముందు అందరినీ ఆకర్షించిన ఈ సినిమా ఎలా ఉంది?

దాదాపుగా బాలీవుడ్ క్రిటిక్స్ అందరూ ఈ సినిమాకు మంచి రివ్యూ.. రేటింగ్స్ ఇచ్చారు. కంగనా మరోసారి తన అద్భుత నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిందని ప్రశంసల వర్షం కురిపించారు. రాజ్ కుమార్ రావ్ కూడా కంగనాతో పోటీపడి నటించాడని మెచ్చుకున్నారు. కనిక ధిల్లాన్ కథ.. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం కూడా బాగుందని కితాబిచ్చారు. ఎవరో ఒకరిద్దరు తప్ప దాదాపు అధిక శాతం క్రిటిక్స్ ఈ సినిమాను మెచ్చుకోవడం విశేషం. ఈ సినిమాకు మౌత్ టాక్ కూడా పాజిటివ్ గా ఉంది.

రిలీజ్ కు ముందు ఈ సినిమాను పలు వివాదాలు ఈ చుట్టూముట్టిన సంగతి తెలిసిందే. టైటిల్ విషయంలో వివాదం తలెత్తితే ఫిలిం మేకర్స్ ‘మెంటల్ హై క్యా’ నుండి ‘జడ్జిమెంటల్ హై క్యా’ అని మార్చుకున్నారు. సినిమాలోని కంటెంట్ పై సైకియాట్రిక్ అసోసియేషన్ వారు కూడా సీబీఎఫ్సీ కి ఫిర్యాదు చేశారు. ఇక కంగనా జర్నలిస్టును దూషించిన వివాదం కూడా చాలా పెద్దదిగా మారింది. ఇన్ని గొడవల మధ్య రిలీజ్ అయిన సినిమాకు ఇలా ప్రశంసలు లభించడం.. ఫిలిం మేకర్స్ కు సంతోషాన్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రకాష్ కోవెలమూడికి ఈ సినిమాతో ఫస్ట్ హిట్ దక్కినట్టే. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ వచ్చే సమయానికి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అనేది తేలే అవకాశం ఉంది.
Please Read Disclaimer