సూపర్ స్టార్లను నవ్విస్తున్న ప్రకాష్ రాజ్

0

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకేవ్వరు’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. సందేశాలు ఉండవు.. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని అనిల్ రావిపూడి హామీ ఇవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాతో మునుపటి తరం లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండడంతో ప్రేక్షకుల్లో మరింతగా ఆసక్తి పెరిగింది.

ఇప్పటికే ఈ సినిమా నుండి పలు అప్డేట్స్ వచ్చాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్ నుంచి ఒక స్టిల్ ను మహేష్ సతీమణి నమ్రత తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ ఫోటోకు “#బిహైండ్ ది సీన్స్ #సరిలేరు నీకెవ్వరు’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలో మహేష్ బాబు తో పాటుగా విజయశాంతి.. ప్రకాష్ రాజ్.. అనిల్ రావిపూడి ముగ్గురూ ఉన్నారు. ప్రకాష్ రాజ్ ఏదో చెప్తూ ఉంటే మిగతా ముగ్గురూ నవ్వుల్లో మునిగిపోవడం చూస్తుంటే షూటింగ్ లొకేషన్ లో ఫుల్ ఫన్ ఉన్నట్టే అనిపిస్తోంది.

ఈ ఫోటోలో మహేష్ ఎప్పటిలాగే తనదైన స్టైల్ లో ఉండగా విజయశాంతి అలానే చూస్తూ స్మైల్ ఇవ్వడం ఆసక్తికరం. మహేష్ బాలనటుడిగా ఉన్న సమయంలో కృష్ణగారికి జోడిగా విజయశాంతి నటించారు. ఇప్పుడు మహేష్ సూపర్ స్టార్ గా ఉన్న సమయంలో విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వడం.. మహేష్ తో కలిసి నటించడం మునుపటి తరం ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిస్తుందనడంలో సందేహం లేదు.
Please Read Disclaimer