కరోనాకు ఇదే మందు: ప్రకాష్ రాజ్ సంచలనం

0

సామాజిక సృహ ఉన్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ఓ సంచలన కామెంట్ చేశారు. చైనాలో పుట్టిన కరోనా వైరస్ దేశానికి రావడం … తెలంగాణలో వెలుగుచూడడంతో అందరూ భయాందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారిని వదలకొట్టేందుకు ఓ అద్భుతమైన మందు ఉందని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చాడు.

తాజాగా ప్రకాష్ రాజ్ ట్వీట్ చేస్తూ ‘’వేడినీళ్లలో నిమ్మకాయ రసం పిండుకొని తాగితే కరోనా వైరస్ రాదని’’ సెలవిచ్చాడు. ఈ విషయాన్ని చైనాకు చెందిన బీజింగ్ మిలిటరీ హాస్పిటల్ సీఈవో చెన్ హోరిన్ తెలిపాడని వివరించాడు. నిమ్మలో ఉండే విటమిన్ సి తో ఈ వైరస్ నుంచి తప్పించుకోవచ్చని ప్రకాష్ రాజ్ తెలిపాడు.

ఇక ఆయుర్వేదానికి ప్రసిద్ధి గాంచిన కేరళ అమ్మాయి మన తెలుగు పాపులర్ యాంకర్ సుమ కూడా తాజాగా కరోనా వైరస్ గురించి తనకు తెలిసిన చిట్కాలను వివరించారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. మనం మరుగున పడేసిన మన సంస్కృతి సంప్రదాయ పద్ధతులను మళ్లీ ఖచ్చితంగా పాటిస్తే ఈ వైరస్ సోకదని చెప్పారు.

కరోనా వల్ల మనం ప్రాణాలు కోల్పోతున్నామని.. అందరూ డాక్టర్లు చెప్పింది విని నడుచుకోవడం తప్ప ఏమీ చేయలేమని జాగ్రత్తలు పాటించాలని బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తెలిపాడు.

బాలీవుడ్ అందాల తార సన్నీలీయోన్ సైతం కరోనాకు భయపడి ఎయిర్ పోర్టుల్లో సెల్ఫీలు ఇవ్వడం లేదట తాజాగా. ఇలా సినీ సెలెబ్రెటీలు తమకు తోచిన విధంగా కరోనా పై ప్రచారం చేస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-