రూమర్ల పై స్పందించిన ‘అ!’ డైరెక్టర్

0

గత కొంతకాలంగా అ! సీక్వెల్ గురించి ఆసక్తికర ప్రచారం సాగుతోంది. ట్యాలెంటెడ్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నా నిర్మాతలు దొరకలేదని గుసగుసలు వినిపించాయి. అ! చిత్రానికి క్రిటిక్స్ ప్రశంసలు దక్కాయి.. జాతీయ అవార్డులు కొల్లగొట్టింది. అయితే హిట్టు టాక్ వచ్చినా బాక్సాఫీస్ కలెక్షన్లలో ఆశించినంత వసూలవ్వలేదని ప్రచారమైంది. అలాగే నిర్మాత నానీతో ప్రశాంత్ క్రియేటివ్ డిఫరెన్సెస్ పైనా తామరతంపరగా కథనాలొచ్చాయి.

విభేధాల వల్లనే అ! సీక్వెల్ ని నిర్మించేందుకు నాని ముందుకు రాలేదని కథనాలొచ్చాయి. కల్కి లాంటి ఫ్లాప్ వల్లనా ఈ సీక్వెల్ కి మరో నిర్మాత సెట్ కాలేదని ప్రచారం సాగింది. అయితే ఈ రూమర్లన్నిటినీ ప్రశాంత్ ఎంతో సింపుల్ గా కొట్టి పారేశాడు. `అసలు నేను మొదట నానీని కలిస్తే కదా!` అంటూ తీసి పారేశాడు. తొలిగా అలాంటి ప్రయత్నం ఏదీ చేయనేలేదని అన్నాడు.

అన్నట్టు నానీ వల్లనే `అ!` మొదలైనప్పుడు.. తన ప్రతిభను గుర్తించి అవకాశం ఇచ్చినప్పుడు ప్రశాంత్ వర్మ ఇలా చేస్తే ఎలా? సీక్వెల్ కోసం కూడా తననే సంప్రదించాలి కదా! ఎందుకని నేచురల్ స్టార్ ని కలిసి సీక్వెల్ కథ చెప్పలేదు? బయట వేరే నిర్మాతల్నే ఎందుకని వెతికాడు? అన్నదానికి సరైన సమాధానం లేదు. అంటే నానీతో క్రియేటివ్ డిఫరెన్సెస్ నిజమని అంగీకరించినట్టేనా?
Please Read Disclaimer