ప్రస్థానం ట్రైలర్ టాక్

0

దేవా కట్టాకు రచయితగా దర్శకుడిగా భారీ గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం ‘ప్రస్థానం’. అయితే సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కినప్పటికీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పలు కారణాల వల్ల సూపర్ హిట్ గా నిలవలేదు. బడ్జెట్ కూడా రికవర్ కాలేదని అప్పట్లో టాక్ వినిపించింది. అయితే సాయి కుమార్ పాత్ర.. శర్వానంద్ కు మాత్రం ఒక మరపురాని సినిమాగా నిలిచిపోయింది.

అదే సినిమాను ఇప్పుడు దేవా కట్టానే సేమ్ టైటిల్ తో హిందీలో తెరకెక్కించారు. సంజయ్ దత్.. అలీ ఫైజల్. మనీషా కొయిరాలా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల అయింది. సాయి కుమార్ పాత్రను పోషించడమే కాకుండా ఈ సినిమా సంజయ్ దత్ స్వయంగా నిర్మించారు. ట్రైలర్ చూస్తుంటే తెలుగు వెర్షన్ కంటే బెటర్ గా తీర్చిదిద్దినట్టుగా అనిపిస్తోంది. ఒరిజినల్ వెర్షన్లో ఉన్న కొన్ని మైనర్ లోటుపాట్లను సరిదిద్ది బాలీవుడ్ ఆడియన్స్ కోసం పవర్ ఫుల్ ఫిలిం ను రెడీ చేసినట్టుగా కనిపిస్తోంది. ఫస్ట్ ట్రైలర్ కంటే సెకండ్ ట్రైలర్ మరింత ఎఫెక్టివ్ గా ఉంది.

సంజయ్.. జాకీ ష్రాఫ్.. మనీషా కొయిరాలా తదితరుల స్క్రీన్ ప్రెజెన్స్.. ఇంటెన్స్ యాక్టింగ్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేవిగా ఉన్నాయి. సెప్టెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఒక్కసారిగా ట్రైలర్ అంచనాలను పెంచింది. దత్ ఎప్పుడు ఒక లీడర్.. దాదా.. గ్యాంగ్ స్టర్ లాంటి పాత్రల్లో కనిపించినా ఆడియన్స్ వెర్రెత్తిపోతారు. ఈ ట్రైలర్ కింద కామెంట్స్ చూస్తుంటే అలాంటి ఫీట్ మరో సారి రిపీట్ కావడం ఖాయం అనిపిస్తోంది. మరోవైపు మన తెలుగు డైరెక్టర్లు హిందీలో డైరెక్ట్ చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలుస్తున్నాయి. మరి ఈ ‘ప్రస్థానం’ కూడా అదేకోవలో సంచలనం సృష్టిస్తుందా అనేది వేచి చూడాలి.
Please Read Disclaimer