సంజూ భాయ్ ‘ప్రస్థానం’ టీజర్

0

దేవకట్టా `ప్రస్థానం` తెలుగు ప్రేక్షకుల్లో ఆల్ టైమ్ హాట్ టాపిక్. ఈ సినిమా రచన .. మేకింగ్ పరంగా గొప్ప ఎపిక్ అన్న ప్రశంసలు దక్కించుకుంది. ముఖ్యంగా దేవాకట్టా రాసిన మాటల్ని ఇప్పటికీ అభిమానులు గుర్తు చేసుకుంటారు. `మహాభారతం` స్ఫూర్తితో రాసుకున్న ప్రస్థానం కథలో ట్విస్టులు ఆసక్తికరం. నాయకుడు అయిన తండ్రికి వారసులతో ఎలాంటి సంక్లిష్ట సన్నివేశం ఎదురైంది? అన్నదానిని ఆసక్తికర స్క్రీన్ ప్లేతో చూపించారు. కథ-కథనం-మాటలు ఇలా ఏ విభాగంలో చూసినా పెర్ఫెక్ట్ అన్న ప్రశంసలు దక్కాయి. క్రిటిక్స్ ప్రశంసలతో పాటు ఈ చిత్రానికి పలు అవార్డులు దక్కాయి.

అందుకే ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు అనగానే అందరిలో ఆసక్తి పెరిగింది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఈ చిత్రంలో సాయికుమార్ పాత్రను పోషిస్తుండగా.. అలీ ఫజల్- జాకీ ష్రాఫ్- చుంకీ పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు. హిందీ ప్రస్థానాన్ని విజువల్ గా ఎంతో గ్రాండియర్ గా తెరకెక్కించారని తాజాగా రిలీజైన టీజర్ చెబుతోంది. ఇందులో సంజూభాయ్ లుక్ అద్భుతంగా కుదిరింది. నోట్లో చుట్ట.. నుదిటిన కుంకుమ బొట్టు .. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో రాజకీయ నాయకుడికి మారు రూపంలా కనిపించారు దత్. చిన్న పాటి టీజర్ లోనే ఎంతో ఇంప్రెషన్ కొట్టేశారనే చెప్పాలి. కెరీర్ ఆరంభమే ప్రస్థానం లాంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన దేవా కట్టా టైమ్ టాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో వెలగలేదు. అందుకే అతడి బాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తి కలిగిస్తోంది. ఒక్క హిట్టు పడితే మునుముందు హిందీ పరిశ్రమలో మంచి ఛాన్సులుంటాయి. అందుకే సంజయ్ దత్ రూపంలో అతడికి అదృష్టం వరించనుందా? అన్న ఆసక్తి నెలకొంది. హిందీ ప్రస్థానంను సంజయ్ దత్ – మాన్యతా దత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

టీజర్ తో తొలి ఇంప్రెషన్ పడిపోయింది. అక్కడ హిట్టు కొట్టడం చాలా ఇంపార్టెంట్. ఇటీవలే `అర్జున్ రెడ్డి` రీమేక్ `కబీర్ సింగ్`తో తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సత్తా చాటాడు. దేవా కట్టాకు అలాంటి ఛాన్సుందేమో చూడాలి. హిందీ మార్కెట్లో తెలుగు కథలు వర్కవుటవుతున్న ఇలాంటి వేళ మరో దర్శకుడికి అక్కడ ఛాన్సుందా? అన్నది వేచి చూడాలి. హిందీ ప్రస్థానం సెప్టెంబర్ 20న రిలీజ్ కానుంది. నేడు సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా `కేజీఎఫ్ 2`లో అధీరా లుక్ తో పాటు ప్రస్థానం టీజర్ రిలీజయ్యాయి.
Please Read Disclaimer