ప్రతిరోజూ పండగే మొదటి రోజు వసూళ్లు

0

మెగా హీరో సాయి ధరమ్ తేజ్- రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రతిరోజూ పండగే’ నిన్నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ప్రేక్షకుల నుంచి అసక్తి వ్యక్తమయింది. సినిమా రిలీజుకు ముందే పాజిటివ్ బజ్ ఉండడంతో సినిమాకు మొదటిరోజు డీసెంట్ ఒపెనింగ్స్ వచ్చాయి.

మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో ‘ప్రతిరోజూ పండగే’ రూ. 3.30 కోట్ల షేర్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపుగా రూ. 4.07 కోట్ల షేర్ సాధించింది. రివ్యూస్ యావరేజ్ గానే ఉన్నప్పటికీ సినిమాలో ఉన్న కామెడీ.. ఎంటర్టైన్మెంట్ కు కుటుంబ ప్రేక్షకుల ఆదరణ దక్కుతోంది. సత్యరాజ్.. రావు రమేష్ లాంటి నటులు తమ పాత్రలతో సినిమాకు ప్లస్ గా నిలిచారు.

ప్రతిరోజూ పండగే మొదటి రోజు ఏరియా వైజ్ కలెక్షన్స్:

నైజాం: 1.26 cr

సీడెడ్: 0.32 cr

ఉత్తరాంధ్ర: 0.46 cr

కృష్ణ: 0.22 cr

ఈస్ట్: 0.31 cr

వెస్ట్: 0.21 cr

గుంటూరు: 0.33 cr

నెల్లూరు: 0.19 cr

ఏపీ తెలంగాణా టోటల్:రూ. 3.30 cr

కర్ణాటక: 0.22 cr

మిగతా ఏరియాలు(అంచనా): 0.55 cr

వరల్డ్ వైడ్ టోటల్: రూ.4.07 cr




Please Read Disclaimer