సంక్రాంతిని మిస్ అవుతున్నాడే

0

కొన్ని సీజన్స్ కి కొన్ని సినిమాలు పర్ఫెక్ట్ అనిపిస్తాయి. ఫెస్టివల్ ని బట్టి జోనర్స్ సెట్ అవుతాయి కూడా. ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అయితే సంక్రాంతికి రావాల్సిందే. అప్పుడే ఆ సినిమా కలెక్షన్స్ తో నెక్స్ట్ రేంజ్ కి వెళ్తుంది. ఇది దర్శక -నిర్మాతలందరూ పాటించేదె. అయితే ప్రస్తుతం సంక్రాంతికి రావాల్సిన ఓ సినిమా మాత్రం ఆ సీజన్ కంటే ముందే వచ్చేస్తోంది.

అదే సాయి తేజ్ నటిస్తున్న ‘ప్రతి రోజు పండగే’. నిజానికి టైటిల్ తో పాటు కథ – కథాంశం అన్నీ సంక్రాంతికి సింక్ అయ్యేలా ఉన్నాయి. ముందుగా మేకర్స్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కట్టే సంక్రాంతికే రిలీజ్ అనుకున్నారు. కానీ థియేటర్స్ లేకపోవడం అప్పటికే బడా సినిమాలతో పాటు కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచి వాడవురా’ కూడా అప్పుడే రావడంతో ఇక చేసేదేం లేక డిసెంబర్ లో ప్లాన్ చేసుకున్నారు.

క్రిస్మస్ సందర్బంగా సినిమా థియేటర్స్ లోకి వస్తున్నప్పటికీ ప్రస్తుతం ఈ సినిమా పోస్టర్స్ టీజర్ అన్నీ సంక్రాంతి సినిమానే అనిపిస్తున్నాయి. ప్రేక్షకులు కూడా సరిగ్గా అదే ఫీలవుతున్నారు. కానీ ఏం చేస్తాం తేజ్ క్రిస్మస్ కి షిఫ్ట్ అయ్యి సంక్రాంతిని మిస్ అయ్యాడు.
Please Read Disclaimer