సంక్రాంతి పుంజుల బిజినెస్ రేంజ్ ఎంత?

0

సంక్రాంతి బరి లో దాదాపు 400-500 కోట్ల మేర బెట్టింగ్ సాగనుందని ఇప్పటికే రిపోర్ట్ అందింది. పెట్టుబడికి రెట్టింపు లాభం ఆశిస్తే 800కోట్ల మేర వసూళ్ల పందెం సాగాల్సి ఉంటుంది. ఇటీవల తెలుగు సినిమా స్టామినా పెరిగిన నేపథ్యంలో థియేటర్ల నుంచి అంత వసూలవుతుందా లేదా అన్నది చూడాలి. ఇకపోతే ఈ సంక్రాంతి సీజన్ లో రెండు సినిమాల మధ్య కీలక పోటీ కొనసాగుతోంది. ప్రచారంలో.. రిలీజ్ పరంగా ఠఫ్ కాంపిటీషన్ కనిపిస్తోంది. జనవరి 11న రిలీజవుతున్న సరిలేరు నీకెవ్వరు.. జనవరి 12న రిలీజవుతున్న అల వైకుంఠపురము లో చిత్రాల పై జనాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ఇరు టీమ్ లు ప్రచారంలో ఒకరితో ఒకరు పోటీ పడుతుండడం చూస్తున్నదే. తాజా సమాచారం ప్రకారం.. మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ ని కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్ 31 మిడ్ నైట్ ఒంటిగంటకు రిలీజ్ చేసే వీలుందని తెలుస్తోంది. ఆల్మోస్ట్ జనవరి 1న ట్రైలర్ వస్తుంది. మరో ఐదు రోజుల్లో అంటే జనవరి 5న భారీగా ప్రీరిలీజ్ వేడుకను నిర్వహిస్తారని వెల్లడైంది. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 100కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ సాగించిందని ప్రచారమవుతోంది. ఇటు తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లోనూ బిజినెస్ పూర్తవుతోందని.. థియేటర్ల ఎరేంజ్ మెంట్స్ పైనా చర్చ సాగుతోందని వినిపిస్తోంది.

అయితే అల వైకుంఠపురములో ట్రైలర్ ఎప్పుడొస్తుంది? ప్రీరిలీజ్ వేడుక ఎప్పుడు.. ఓవరాల్ ప్రీరిలీజ్ బిజినెస్ రేంజు ఎంత? అన్నదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇక బన్ని టీమ్ నుంచి డిసెంబర్ 31 మిడ్ నైట్ ట్రీట్ ఉంటుందని.. జనవరి తొలి వారంలోనే ప్రీరిలీజ్ ట్రీట్ కి ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే లిరికల్ వీడియోలు టీజర్ ఇచ్చిన హైప్ తో నాన్ థియేట్రికల్ రైట్స్ లో బన్ని స్పీడ్ కొనసాగుతోందన్న లీకులు అందుతున్నాయి. అల వైకుంఠపురములో చిత్రానికి దాదాపు 100కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ సాగనుందని అంచనా వేస్తున్నారు. అయితే సరిలేరు.. అల టీమ్ ల నుంచి ఏరియా వైజ్ బిజినెస్ వివరాలు వెల్లడికావాల్సి ఉంటుంది. దానిని బట్టి ఎవరి స్టామినా ఎంత? అన్నది తేలనుంది.
Please Read Disclaimer