సూపర్ స్టార్ కోసం లాఠీ పట్టిన హాటీ

0

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘దబాంగ్ 3’ చిత్రం ప్రమోషన్ లో బిజీ బిజీగా ఉన్నాడు. డిసెంబర్ 20న విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం గత నెల రోజులుగానే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టాడు. గతంలో ఎప్పుడు లేనంతగా ఈ సినిమా కోసం సల్మాన్ జీ ప్రమోషన్స్ చేస్తున్నాడు. దేశ వ్యాప్తంగా ఈ సినిమా కోసం డాన్స్ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ముఖ్య నగరాల్లో ఆయా ప్రాంతాలకు చెందిన స్టార్స్ తో షోలు చేయించబోతున్నాడు.

ఇటీవల ఈయన బాలీవుడ్ స్టార్ హాటీ హీరోయిన్ ప్రీతీజింతాతో ఫొటో షూట్ ఇచ్చాడు. ఈ ఫొటోల్లో సల్మాన్ ఖాన్ దబాంగ్ చిత్రంలో ఎలా అయితే కనిపించబోతున్నాడో అలాగే అంటే పోలీస్ గా కాస్ట్యూమ్స్ వేసుకుని ఉండగా హాట్ బ్యూటీ ప్రీతిజింతా కూడా బ్లూ కలర్ పోలీస్ యూనిఫార్మ్ వేసుకుంది. తలపై పోలీస్ క్యాప్ ధరించి చేతిలో లాఠీ పట్టుకుని సల్మాన్ ఖాన్ తో ఈ అమ్మడు ఇచ్చిన స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రీతిజింటా ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన విషయం తెల్సిందే. ఈమద్య కాలంలో ఈమె సినిమాలు తగ్గించింది. అయినా కూడా సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 చిత్రం కోసం ఈ ఫొటో షూట్ ఇచ్చింది. హాలోవీన్ లో ఏదైనా సాధ్యమే.. జస్ట్ ఫర్ ఫన్ అంటూ ప్రీతి ఇన్ స్టా గ్రామ్ లో ఈ ఫొటోలను పోస్ట్ చేసింది. దబాంగ్ 3 ప్రమోషన్స్ కోసం కొత్త తరహా పంథాను అనుసరిస్తున్న సల్మాన్ ఖాన్ ఈ ఫొటోలతో మరోసారి సినిమాకు మంచి పబ్లిసిటీని తీసుకు వచ్చాడు.
Please Read Disclaimer