ప్రెజర్ కుక్కర్ – ఫస్ట్ లుక్

0

టాలీవుడ్ లో ఈ మధ్య వైవిధ్యతకు ప్రేక్షకులు పెద్ద పీఠ వేస్తున్నారు. టైటిల్ మొదలుకుని కాన్సెప్ట్ దాకా కొత్తగా ప్రెజెంట్ చేస్తే హీరో ఎవరు అని పట్టించుకోకుండా హిట్ చేసి పెడతారు. అదే కోవలో వచ్చేలా కనిపిస్తున్న మూవీ ప్రెజర్ కుక్కర్. ఇవాళ సురేష్ బాబు చేతుల మీదుగా ఫస్ట్ లుక్ రిలీజయింది. సాయి రోనాక్-ప్రీతీ ఆష్రాని జంటగా నటిస్తున్న ఈ సినిమాకు జంట దర్శకులు సుజయ్-సుశీల్. వీళ్ళిద్దరూ ప్రవాసాంధ్రులు. కేవలం సినిమాల మీద ప్యాషన్ తో ఇండియా వచ్చి తమ కలను నిజం చేసుకున్నారు.వీరితో పాటు అప్పిరెడ్డి మరో నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు.

అమెరికా మోజులో పడి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుని వీధుల పాలవుతున్న మధ్య తరగతి కుటుంబాలకు కనువిప్పు కలిగే రీతిలో ఎంటర్ టైనింగ్ తరహాలో ఇందులో మెసేజ్ ఉంటుందని దర్శకులు అంటున్నారు. ఇందులో హీరో పాత్ర పేరు కిశోర్. అమెరికా వెళ్లాలనే కలలతో మొదలైన కెరీర్ ఎలా సాగింది అనేదే ఇందులో మెయిన్ పాయింట్. దీనికి దర్శకుల తరహాలోనే మరో విశేషం ఇద్దరు సంగీత దర్శకులు ట్యూన్స్ కంపోజ్ చేయడం. సునీల్ కశ్యప్ తో పాటు రాహుల్ సింప్లిగుంజ్ పాటలు ట్యూన్ చేశారు.

అర్జున్ రెడ్డితో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన హర్షవర్ధన్ రామేశ్వర్ బీజీఎమ్ సమకూర్చడం విశేషం. నగేష్ బనెల్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

తనికెళ్ళ భరణి – రాహుల్ రామకృష్ణ – సంగీత – రాజై రోవన్ ఇతర కీలక పాత్రలు పోష్హిస్తున్న ఈ ప్రెజర్ కుక్కర్ ని అతి త్వరలో విడుదల చేయబోతున్నారు. ప్రతి మనిషి జీవితంలో నిత్యావసరమైన ప్రెజర్ కుక్కర్ పేరుతో వస్తున్న ఈ మూవీ మీద యూత్ లో మంచి క్రేజ్ వచ్చేలా కనిపిస్తోంది. త్వరలో ఆడియోతో పాటు రిలీజ్ డీటెయిల్స్ ప్రకటించనున్నారు
Please Read Disclaimer