మెడలో నోట్ల కట్టలు.. ఎందుకంత పిచ్చి ప్రియా?

0

డబ్బు లేనిదే ఏదీ లేదు. పైసా మే పరమాత్మ. డబ్బు డబ్బునిస్తుంది. డబ్బును పెంచుతుంది. డబ్బు జబ్బును తెస్తుంది. ఆ తర్వాత తగ్గిస్తుంది కూడా.. ! అందుకే మనిషికి డబ్బంటే అంత పిచ్చి. డబ్బు కోసమే జీవిస్తాడు!!

ఇక్కడ చూస్తుంటే లీడర్ భామ ప్రియా ఆనంద్ కి అలాంటి పరిస్థితే దాపురించింది. ఒళ్లంతా నోట్ల కట్టలే కనిపిస్తున్నాయ్. ఆ మెడలో హారం 2000 నోట్లతో తయారు చేసారు మరి. పైగా వాటిని లెక్కిస్తూ విసిరి కొట్టేందుకు సిద్ధమవుతోంది ప్రియా. ఇదంతా చూస్తుంటే ఏదో సినిమా సీన్ కోసమే అనుకున్నారా? అవును నిజమే.

ప్రియ ఆనంద్ ఇటీవల ధ్రువ్ విక్రమ్- బానిటా సంధు నటించిన `ఆదిత్య వర్మ` చిత్రంలో గ్లామరస్ పాత్రలో కనిపించింది. అలాగే కన్నడ చిత్రాలతో చాలా బిజీగా ఉంది. తన కొత్త హిందీ వెబ్ సిరీస్ ‘ఎ సింపుల్ మర్డర్’ స్ట్రీమింగ్ నుండి ఆకర్షణీయమైన ఫోటోలను సోనీ లివ్ లో పోస్ట్ చేసింది. డబ్బు దండను మెడలో ధరించి.. డబ్బు పిచ్చోళ్లను టీజ్ చేసింది.

`ఎ సింపుల్ మర్డర్` సిరీస్ సచిన్ పాథక్ దర్శకత్వం వహించిన బ్లాక్ కామెడీ. ఇందులో ప్రియా ఆనంద్- మహ్మద్ జీషన్ అయూబ్ – సుశాంత్ సింగ్ – అమిత్ సియాల్ తదితరులు తారాగణం. ప్రియా తమిళంలో తదుపరి విడుదల హోజీమిన్ దర్శకత్వం వహించిన `సుమో`. రాజీవ్ మీనన్ ఛాయాగ్రహణం ఈ మూవీకి ప్రధాన అస్సెట్ కానుంది. మిర్చి శివ- యోగి బాబు -సుమో రెజ్లర్ యోషినోరి తాషిరో తదితరులు నటించారు.