అప్పుడు మిస్ చేసుకుని ఇప్పుడు వెతుక్కుంటుంది

0

సోషల్ మీడియా సెన్షేషన్.. మలయాళి ముద్దుగుమ్మ ప్రియావారియర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో ఈమె ఒక్క సినిమా చేయకున్నా కూడా సోషల్ మీడియా ద్వారానే చాలా పెద్ద స్టార్ గుర్తింపు దక్కించుకుంది. ఈమె మొదటి సినిమా ఒరు ఆదార్ లవ్ తెలుగులో కూడా విడుదలైంది. అన్ని భాషల మాదిరిగానే తెలుగులో కూడా ఫ్లాప్ అయ్యింది. ఒరు ఆదార్ లవ్ సినిమా విడుదలకు ముందు వరకు ప్రియా వారియర్ కు టాలీవుడ్ లో భారీ క్రేజ్ ఉండేది.

సోషల్ మీడియాలో సెన్షేషన్ అవ్వగానే ప్రియా వారియర్ తో సినిమాలు చేయాలని చిన్నా పెద్ద నిర్మాతలు చాలా మంది ప్రయత్నాలు చేశారు. పలువురు దర్శకులు కూడా ఈమెను సంప్రదించినట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఆ సమయంలో తన మొదటి సినిమా ఒరు ఆదార్ లవ్ పూర్తి అయ్యి విడుదలైన తర్వాత తెలుగు సినిమాలో నటిస్తానంటూ వచ్చిన పెద్ద పెద్ద అవకాశాలను మిస్ చేసుకుంది. అప్పుడు ఆమె డేట్ల కోసం ఎగబడ్డ నిర్మాతలు ఇప్పుడు ఆమె వంక కూడా చూడటం లేదట.

ఒరు ఆదార్ లవ్ చిత్రం తర్వాత చేసిన హిందీ సినిమా శ్రీదేవి బంగ్లా. ఆ సినిమా వివాదం కారణంగా విడుదలకు నోచుకోవడం లేదు. ఆ సినిమా తర్వాత చిన్నా చితకా సినిమాలు తప్ప ఈమెకు పెద్దగా ఆఫర్లే లేవు. అప్పుడు టాలీవుడ్ లో స్టార్స్ పక్కన మెయిన్ హీరోయిన్ పాత్రకు సంప్రదించిన నిర్మాతలు ఇప్పుడు సెకండ్ హీరోయిన్ పాత్రకు సంప్రదిస్తున్నారట. ఇటీవలే తెలుగులో ప్రియా వారియర్ మొదటి సినిమాకు సైన్ చేసింది. సెకండ్ హీరోయిన్ గా నితిన్.. చంద్రశేఖర్ యేలేటి చిత్రంలో ఈ అమ్మడు నటిస్తోంది.

ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. రకుల్ క్రిమినల్ లాయర్ పాత్రలో కనిపించబోతుందట. ఇక ప్రియా వారియర్ పాత్ర కూడా ఈ చిత్రంలో ప్రముఖంగా ఉంటుందని అంటున్నారు. ఎంత ప్రముఖంగా ఉన్నా కూడా సెకండ్ హీరోయినే కదా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home