వింక్ గర్ల్ కు బ్రేక్ ఇస్తాడా?

0

ప్రియా ప్రకాష్ వారియర్ పేరు తెలియని నెటిజన్లు దాదాపుగా ఉండరు. మలయాళం సినిమా ‘ఒరు ఆదార్ లవ్’ లో నటించిన ఈ కేరళ చిన్నది ఆ సినిమాలో ఒక పాటలో వయ్యారంగా కన్నుగీటి సోషల్ మీడియాను షేక్ చేసింది. దాంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించింది. ఇప్పటికీ తన సోషల్ మీడియా ఖాతాలకు భారీ ఫాలోయర్స్ ఉన్నారు.

అయితే సినిమాల విషయానికి వస్తే మాత్రం ప్రియా కెరీర్ మాత్రం అనుకున్నంత స్పీడుగా సాగడం లేదు. ప్రియాకు మొదట్లో భారీ టాలీవుడ్ ఆఫర్లు వచ్చాయని ప్రచారం సాగింది కానీ మొదటి సినిమా ‘ఒరు ఆదార్ లవ్’ రిలీజ్ అయిన తర్వాత మాత్రం క్రేజ్ తగ్గింది. ఆ సినిమా తెలుగు వెర్షన్ బోల్తా కొట్టడం.. నటన విషయంలో ప్రియా కాస్త వీక్ అని తేలడంతో పెద్ద ఆఫర్లు రాలేదనే టాక్ వినిపించింది. అయినా ప్రస్తుతం ప్రియా చేతిలో ఒక తెలుగు సినిమా ఆఫర్ ఉంది. నితిన్ – చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో ప్రియా వారియర్ హీరోయిన్. ఈ సినిమానే కాదు.. రీసెంట్ గా ప్రియాకు మరో అవకాశం కూడా వచ్చిందని సమాచారం.

యువహీరో సందీప్ కిషన్ నెక్స్ట్ సినిమాలో కథ ప్రకారం ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. ఆ ఇద్దరిలో ఒకరిగా ప్రియాను ఎంచుకున్నారని టాక్. దీంతో ప్రియాకు టాలీవుడ్ లో డిమాండ్ ఉందనే విషయం తేలినట్టే. క్రేజీ ఆఫర్లు ఉన్నా లేకపోయినా అసలంటూ ఆఫర్లు ఉంటే మేలు కదా. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలో ఏది హిట్ అయినా టాలీవుడ్ ఫిలిం మేకర్లు కొత్త ఆఫర్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ సందీప్ కిషన్ సినిమా వింక్ బ్యూటీకి లక్కు తీసుకొస్తుందా లేదా అనేది వేచి చూడాలి. టాలీవుడ్ ఆఫర్ల సంగతేమో కానీ మలయాళం.. హిందీలో కూడా ప్రియాకు ఆఫర్లు ఉన్నాయి.
Please Read Disclaimer