ఫైటర్ మూవీలో ప్రియా ప్రకాష్ వారియర్?

0

వరుస పరాజయాలతో ఢీలా పడిన పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండకు డియర్ కామ్రేడ్ సినిమా ఆశించిన ఫలితాన్నైతే ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ‘ఫైటర్ అనే సినిమా చేస్తుండడంతో ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమాపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. పూరీ జగన్ సినిమాలలో హీరోలు ఎంత మాస్ గా ఉంటారో మనకు తెలిసిందే. అందులోనూ ఈ ‘ఫైటర్’ సినిమా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అదే నిజమైతే ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయికి వెళ్లిపోతాయి.

ఇప్పుడు ఈ సినిమా గురించి ఇంకొక న్యూస్ బయటకొచ్చింది. కేవలం తన కనుసైగలతో ఓవర్ నైట్ లో ఇండియా మొత్తం ఫేమస్ అయిపోయిన మలయాళీ స్టార్ ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో మన రౌడీ స్టార్ పక్కన హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాని పూరీ డిసెంబర్ కానీ జనవరిలో కానీ రిలీజ్ చేయాలని చూస్తున్నాడు.
Please Read Disclaimer