నీ మళవిల్లు పోలే.. ప్రియా వారియర్ టచ్ చేసిందిగా

0

సోషల్ మీడియా సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ తెలుసు కదా.. కన్ను గీటే వీడియో క్లిప్ తో ‘వింక్ గర్ల్’ గా పాపులర్ ఆయిన ఈ బ్యూటీ పేరు అందరికీ తెలిసే ఉంటుంది. ‘ఒరు ఆదార్ లవ్’ అనే మలయాళం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా డబ్బింగ్ వెర్షన్ ‘లవర్స్ డే’ తెలుగులో రిలీజ్ అయినా ఫ్లాప్ కావడంతోఎవరూ పట్టించుకోలేదు. ప్రియ త్వరలో టాలీవుడ్ లో హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇస్తోంది. నితిన్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాను రీసెంట్ గా లాంచ్ చేశారు.

ఇదిలా ఉంటే ఈ ప్రియ మరో విషయంలో ఒక్కసారిగా నెటిజన్లను మెస్మరైజ్ చేసేసింది. మలయాళంలో ‘ఫైనల్స్’ అనే టైటిల్ తో ఒక స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడు కైలాస్ మీనన్. ఆయన ప్రియా వారియర్ తో ఒక పాట పాడించాడు. ‘నీ మళవిల్లు పోలే’ అంటూ సాగే ఈ సాఫ్ట్ రొమాంటిక్ సాంగ్ ను నరేష్ అయ్యర్ తో కలిసి ఆలపించింది. ఈ పాట ను స్టూడియో లో రికార్డ్ చేసిన వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో ను ప్రియ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేయడంతో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఒకలాంటి హస్కీ వాయిస్ తో ఎంతో మెలోడియస్ గా పాడిన ప్రియాను నెటిజన్లు ప్రశంసలతో ముంచెతున్నారు.

మీరు ఒకసారి లుక్కేయండి. “న్యాన్ మలయాళి కాదు. ఎన్న పరంద ఎన్న చాట రాదు” అని దిగులు పడకుండా జస్ట్ వాయిస్ మాత్రం వినండి. దీని సంగతి పక్కన పెడితే ప్రియా ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలు.. కన్నడలో కూడా ఒక సినిమా చేస్తోందట.
Please Read Disclaimer