మళ్లీ కలుస్తున్న.. డైరెక్టర్ హీరో.. ఈ సారి కామెడీనే!

0

బాలీవుడ్ లో ప్రియదర్శన్- అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ ప్రత్యేకం. మలయాళీ సినిమాలతో ఫేమస్ అయిన తర్వాత ప్రియదర్శన్ బాలీవుడ్ వైపు వెళ్లాడు. మొదట్లో అక్కడ సీరియస్ సినిమాలే తీశాడాయన. అయితే ఆ తర్వాత మలయాళీ కామెడీ సినిమాలను హిందీలో రీమేక్ చేయడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో కొన్ని సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు ప్రియన్.

వాటిల్లో హీరోగా తప్పనిసరిగా అక్షయ్ కుమార్ కనిపిస్తూ వచ్చాడు. అలా వీరి కాంబినేషన్లో ‘హేరాఫెరీ’ వంటి సూపర్ హిట్ వచ్చింది. ఆ సినిమాలో అక్షయ్ కుమార్ సునీల్ షెట్టి పరేష్ రావల్ లు నటించారు. ఆ సినిమా అత్యంత భారీ కలెక్షన్లు పొందిన బాలీవుడ్ కామెడీ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

ఆ తర్వాత కూడా అక్షయ్- ప్రియదర్శన్ కాంబినేషన్ లో సినిమాలు వచ్చాయి. ‘బాగమ్ బాగ్’ వంటి ఇంకోకామెడీ వచ్చింది. ఆ తర్వాత ‘చంద్రముఖి’ హిందీ రీమేక్ కు ప్రియదర్శన్ దర్శకత్వం వహించగా అందులో అక్షయ్ హీరోగా నటించాడు. వీరి కాంబినేషన్లో చివరగా పదేళ్ల కిందట ఒక సినిమా వచ్చింది. అదే ‘కట్టామిట్టా’ ఈ తర్వాత ఈ కాంబినేషన్ కు తెరపడింది.

ఈ క్రమంలో ఇప్పుడు తను అక్షయ్ కుమార్ హీరోగా ఒక సినిమాను చేయబోతున్నట్టుగా ప్రియదర్శన్ ప్రకటించాడు. త్వరలోనే అది పట్టాలెక్కుతుందని అది కూడా కామెడీ సినిమానే అని ప్రియన్ తెలిపాడు.
Please Read Disclaimer