రీల్ మల్లేశం రియల్ వైఫ్ లెక్క వేరేనట!

0

హాస్య నటుడిగా కెరీర్ షురూ చేయటం అంత తేలికైన విషయం కాదు. అదే సమయంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం అందరికి సాధ్యమయ్యే పని కాదు. అయితే.. ఈ రెండు విషయాల్ని విపరీతమైన శ్రమతో తనదైన గుర్తింపు తెచ్చుకున్నోడు ప్రియదర్శి పులికొండ. ఈ పేరు ఎక్కడా వినట్లు లేదే? అన్న సందేహం అక్కర్లేదు. ఎందుకంటే.. అతన్ని చూస్తే.. ఓ ఇతనా? అనేస్తారు. కానీ.. పేరు అడిగితేనే వెంటనే సమాధానం చెప్పలేరు.

అలాంటి స్థితిలో తాజాగా అతడు చేసిన మల్లేశం సినిమా అతడి ఇమేజ్ ను పూర్తిగా మార్చేసింది. ఒక హాస్యనటుడు ఏకంగా హీరోగా.. అందులోకి రోటీన్ కు భిన్నమైన సినిమాను చేసి మనసు దోచుకోవటమే కాదు.. మల్లేశం పాత్రలో జీవించేశాడు. మూడేళ్లలో 30కి పైగా సినిమాలు చేసినా.. అతడి కెరీర్ లో నిలిచిపోయే సినిమాలు కొద్దే. అందులో పెళ్లిచూపులు.. మల్లేశం.. లాంటి చిత్రాలుగా చెప్పక తప్పదు.

మల్లేశం చిత్రం తర్వాత ప్రియదర్శి గురించి వివరాలు తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగింది. అతడి వ్యక్తిగత విషయాలు తెలిస్తే మరికాస్త ఆసక్తికరంగా అనిపించటం ఖాయం. మల్లేశం రియల్ లైఫ్ వైఫ్ ఎవరన్న విషయాన్ని తాజాగా వెల్లడించారు ప్రియదర్శి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీలో క్లాస్ మేట్ అయిన రిచాశర్మ అతడి లైప్ పార్టనర్.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. చదువుకునే రోజుల్లో వారిద్దరి మధ్యా ఎలాంటి కెమిస్ట్రీ లేదు సరికదా.. హాయ్.. బై అనేసుకోవటమే తప్పించి ఎక్కువగా మాట్లాడుకున్నది కూడా లేదట. పుస్తకాల పురుగైన రిచా భార్యగా ఎలా మారిందన్నది చెప్పుకొచ్చాడు. ఫేస్ బుక్ లో ఆమె ఇంగ్లిషు పొయెట్రీ కి ఫిదా అయిపోయి.. ఆసక్తి పెరిగిందని.. అలాంటి అమ్మాయి జీవితంలోకి వస్తే బాగుంటుందనిపించిందని చెప్పారు.

సినిమాల్లో అవకాశాలు రాని వేళ.. తనలోని టాలెంట్ ను గుర్తు చేస్తూ ప్రోత్సహించేదని.. అలా మొదలైన వారి స్నేహం ప్రేమగా మారి.. గత ఏడాది పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆమె ఒక ఇంగ్లిషు నవల రాసే పనిలో ఉందని చెప్పిన ప్రియదర్శి.. ఫ్రెండ్స్ తో కలిసి ఒక స్టార్టప్ ని కూడా స్టార్ట్ చేశారని చెప్పారు.Please Read Disclaimer